ఆ అట్టర్ ప్లాప్ ను మర్చిపోని బాలయ్య

0

తనను తాను హార్డ్ కోర్ నందమూరి అభిమానిగా చెప్పుకుంటూ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి నందమూరి బాలకృష్ణతో ఓ ఛాన్స్ పట్టేశాడు. ఎప్పుడో 2006లో అంబికా కృష్ణ నిర్మాతగా వచ్చిన వీరభద్ర సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సినిమా దెబ్బతో రవికుమార్ చౌదరిని దగ్గరకు రానిచ్చేందుకు కూడా ఎవ్వరూ సాహసించని పరిస్థితి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హిట్ కొట్టాడు. ఆ వెంటనే గోపీచంద్ సౌఖ్యం సినిమాతో ఘోరమైన డిజాస్టర్.

మళ్లీ రవికుమార్ కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ సాహసించని పరిస్థితి. అలాంటి రవికుమార్ చౌదరి నితిన్ కోసం ఓ స్క్రిఫ్ట్ రెడీ చేస్తున్నాడట. ఇదిలా ఉంటే 2004లో గోపీచంద్ తో తీసిన యజ్ఞం సినిమా హిట్ అవ్వడంతో రవికుమార్ చౌదరి బాలయ్యను ఏదోలా పట్టేసి వీరభద్ర లాంటి డిజాస్టర్ సినిమా తీశాడు. ఆ సినిమా రిజల్ట్ చూశాక బాలయ్యకే మైండ్ బ్లాక్ అయ్యింది. అప్పటి నుంచి బాలయ్యకు సింహా వరకు అన్ని ప్లాపులే పలకరించాయి.

ఇక ఇప్పుడు మళ్లీ రవికుమార్ చౌదరి బాలయ్యను కాకాపట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఈ పదేళ్లలో రవికుమార్ చౌదరి కి చెప్పుకోదగ్గ సినిమా ’పిల్లా నువ్వులేని జీవితం‘ ఒకటే. ఆ సినిమా కథ – కథనాలు కూడా అంత గొప్పగా లేకపోయినా కామెడీ – సాయిధరమ్ డెబ్యూ మూవీ కావడంతో గట్టెక్కింది. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య కోసం కథలు రెడీ చేస్తున్నా అని చెపుతున్నా బాలయ్య మాత్రం రవికుమార్ చౌదరికి అపాయింట్ మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని టాక్.

ఈ యేడాది ఎన్టీఆర్ బయోపిక్ లు రెండు డిజాస్టర్ అవ్వడంతో కాస్త కోలుకుని కేఎస్.రవికుమార్ సినిమాకు కమిట్ అయిన బాలయ్య రవికుమార్ చౌదరి లాంటి డిజాస్టర్ డైరెక్టర్తో రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేడట.
Please Read Disclaimer