బిగ్ బాస్ బ్యూటీ తెలియదన్న అశీష్ గౌడ్

0

హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో వీరంగం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆశీష్ గౌడ్ తమతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. మద్యం బాటిళ్లతో దాడి చేసి మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశాడంటూ బిగ్ బాస్ లో పాల్గొన్న బ్యూటీ సంజన ఆదివారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బిగ్ బాస్ రెండో సీజన్ లో పాల్గొన్న సంజన చేసిన ఆరోపణలను తాజాగా అశీష్ గౌడ్ ఖండించారు. తాను నోవాటెల్ లో పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చాడు.

పోలీసులు విచారణ చేయాలని.. అందులో అన్ని విషయాలు బయటకు వస్తాయని అశీష్ గౌడ్ తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన బిగ్ బాస్ బ్యూటీ సంజన అసలు ఎవరో కూడా తనకు తెలియదని అశీష్ గౌడ్ చెప్పడం కొసమెరుపు.
Please Read Disclaimer