బిగ్ బాస్ హౌస్ నుంచి అషు ఔట్…

0

గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ ఐదో వారం కూడా కొనసాగింది. ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ షో నుంచి అషు రెడ్డి బయటకెళ్లింది. మొదటి వారం హేమ – రెండో వారం జాఫర్ – మూడో వారం తమన్నా – నాలుగో వారం రోహిణిలు ఇంటి నుంచి బయటకెళ్లిన విషయం తెల్సిందే. ఇక ఐదో వారం నామినేషన్స్ లో మహేశ్ – శివజ్యోతి – బాబా భాస్కర్ – పునర్నవి – రాహుల్ – హిమజ – అషులు ఉన్నారు. ఇందులో శనివారం ఎపిసోడ్ లో మహేశ్ – శివ జ్యోతిలు సేఫ్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

దీంతో ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఇంటికి బయటకు వెళతారని టెన్షన్ నెలకొంది. ఆ టెన్షన్ కొనసాగిస్తూ నాగ్ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ మధ్య మధ్యలో సేఫ్ అయిన వారి పేర్లని చెప్పారు. ఈ క్రమంలో ముందు బాబా భాస్కర్ సేఫ్ అయ్యాడని చెప్పారు. ఆ తర్వాత పునర్నవి – రాహుల్ ని సేఫ్ చేశారు. చివరికి హిమజ – అషు రెడ్డి మిగిలారు. వీరిలో అషు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగార్జున – హిమజ సేఫ్ అయినట్లు చెప్పారు. ఇక అషు వెళ్ళేటప్పుడు శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టేసింది. ఆమెని ఓదార్చి – హౌస్ మేట్స్ అందరికీ బై చెప్పేసి అషు బయటకొచ్చేసింది.

ఇక బయటకొచ్చిన అషురెడ్డితో నాగార్జున ఓ గేమ్ ఆడించారు. ఆమె ముందు ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలన్నీ ఉంచి.. హౌస్ లో ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నావో ఆ ఫొటోలు ఉంచి మిగిలినవి పగలగొట్టమని నాగార్జున సూచించారు. దీంతో అషు…మహేష్ – రాహుల్ – వితికా – హిమజ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదని కారణాలు చెబుతూ వారి ఫొటోలను పగలగొట్టింది. ఇక శివజ్యోతి – శ్రీముఖి – పునర్నవి – బాబా భాస్కర్ – అలీ రెజా – రవికృష్ణ – వరుణ్ సందేశ్ లు ఇంట్లో ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పింది.
Please Read Disclaimer