పవన్ సినిమానైనా వదిలేస్తుందట కాని దాన్ని మాత్రం వదలదట!

0

పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా సినిమా స్టార్స్ లో కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉంటారు. చాలా మంది ఇండస్ట్రీ కి చెందిన వారు తాము పవన్ కళ్యాణ్ అభిమానులం అంటూ చెప్పుకునేందుకు చాలా గర్వపడుతూ ఉంటారు. అందులో ఒక అభిమానురాలు అషు రెడ్డి. ఈ అమ్మడు ఆమద్య జూనియర్ సమంతా అనిపించుకుంది. కాని కాస్త బొద్దుగా అవ్వడంతో ఈమె సమంత ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ కు ముందు వరకు ఈమె గురించి కేవలం నెటిజన్స్ కు మాత్రమే తెలుసు. కాని బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు బుల్లి తెరపై చాలా సందడి చేసింది. ఈమె ప్రైవేట్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ పేరును టాటూ వేయించుకున్న విషయం తెల్సిందే. ఆమె పవన్ ఫ్యాన్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఆధరిస్తారని కూడా టాక్ ఉంది. ఇక తాజాగా ఆమె సుమ క్యాష్ షో లో పాల్గొనేందుకు వెళ్లింది.

ఈ సందర్బం గా సుమ సరదాగా నీవు వేయించుకున్న పవన్ కళ్యాణ్ పేరు టాటూ ఇంకా ఉందా అని అడిగింది. అందుకు ఉందని అషు సమాధానం చెప్పగా టాటూ తొలగించుకుంటావా? పవన్ సినిమా ఆఫర్ ను వదిలేస్తావా అంటూ సుమ ప్రశ్నించింది. అందుకు వెంటనే పవన్ సినిమా లో ఆఫర్ ను వదిలేసుకుంటాను కాని టాటూను మాత్రం తొలగించుకోను అంది. పవన్ కళ్యాణ్ కు నేను అభిమానిని కాదు ఆయన భక్తురాలిని అంటూ సగర్వంగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer