అసురన్ రీమేక్.. ప్రమాదం లో పడిందా?

0

ఇలా రిలీజైన సినిమాని అలా డిజిటల్ లో వీక్షించే సౌలభ్యం కలుగుతోంది. దీంతో స్మార్ట్ యూత్ అటు వైపే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. 2019 సంక్రాంతి మొదలు ఇప్పటి వరకూ టాలీవుడ్ లో రిలీజైన ప్రతి సినిమా డిజిటల్లో అందుబాటు లో ఉన్నాయి. ఏ సినిమా రిలీజైనా కేవలం నాలుగు వారాల్లోనే ఆన్ లైన్ స్ట్రీమింగు కి అందుబాటు లోకి వచ్చేస్తుండడం తో వీటిని మొబైల్ లో వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో థియేటర్ల కు వచ్చేవారి సంఖ్య అంతే దారుణంగా పడి పోయిందని విశ్లేషిస్తున్నారు. డిజిటల్ వీక్షణకు అలవాటు పడుతున్నది కేవలం యూత్ మాత్రమే కాదు.. ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ ఆసక్తి చూపిస్తుండడం కొత్త పరిణామం.

తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `అసురన్` అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇటీవల ఈ సినిమా ట్రెండింగ్ టాపిక్ కావడంతో అందరూ ఆన్ లైన్ లో వీక్షించేందుకు ఎగబడుతున్నారు. అయితే ఈ పరిణామం అసురన్ తెలుగు రీమేక్ పై బిగ్ పంచ్ వేయ బోతోందని విశ్లేషిస్తున్నారు. అసురన్ రీమేక్ హక్కుల్ని చేజిక్కించుకున్న అగ్రనిర్మాత డి.సురేష్ బాబు ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్క్రిప్టును రూపొందించే పనిలో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండగా.. రీమేక్ దర్శకుడి కోసం వెతుకుతున్నారు. అయితే ఈలో గానే ఆన్ లైన్ లో అసురన్ రిలీజై పోవడం తో తెలుగు జనం అక్కడ చూసేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ ప్రభావం తెలుగు రీమేక్ పై ఉంటుందా ఉండదా? అంటూ కొత్తగా సోషల్ మీడియా లో డిబేట్ మొదలైంది.

డిజిటల్ ని ఎంకరేజ్ చేసేది టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాత లే. సినిమా తీసి చాలా ముందే కొంతవరకూ సేఫ్ అయిపోవడం డిజిటల్ వల్ల సాధ్యం అనేది వీళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఇతరత్రా కోణాల్లో విశ్లేషి స్తే దీనివల్ల పెద్ద పంచ్ పడుతోంది. మరి తాజా విక్టిమ్ డి.సురేష్ బాబు కాబట్టి ఆయన ఏ కోణంలో విశ్లేషిస్తారు? అన్నది చూడాలి. ఇంతకీ వెంకీతో అసురన్ రీమేక్ సేఫా కాదా? అన్నది ఆయనే స్వయంగా విశ్లేషిస్తే బావుంటుందేమో!!
Please Read Disclaimer