పీసీ స్మోకింగ్ .. నీతులు ఎదుటివారికేనా?

0

నీతులు చెప్పేది ఎదుటివాళ్లు ఆచరించేందుకే.. నాకు వర్తించవు! అన్నట్టే ఉంది పీసీ వాలకం. పొగతాగడం చెండాలం.. భయంకరం! అంటూ గతంలో ట్వీట్ చేసిన ప్రియాంక చోప్రా (పీసీ) ఇదిగో ఇలా అడ్డంగా దొరికిపోయి నెటిజనులతో చీవాట్లు తింటోంది. నిన్నగాక మొన్న విదేశాల్లో బర్త్ డే జరుపుకున్న అమెరికా కోడలుకి హబ్బీ నిక్ జోనాస్ అదిరిపోయే పార్టీ ఇచ్చాడు. మియామీ సముద్రంలో అదో అందమైన విలాసవంతమైన యాచ్ (పడవ). ఆ యాచ్ లో ఓపెన్ టాప్ లో ప్రయాణిస్తూ నిక్యాంక జోడీ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో పీసీ మామ్ మధు చోప్రాతో పాటు బంధుమిత్రులు స్నేహితులు కూడా ఉన్నారు. వీళ్లంతా గుంపుగా చేరి వైన్ సేవిస్తూ మధ్యలో గుప్పు గుప్పు మంటూ పొగ వదిలారు. సిగరెట్లు తాగి యాచ్ లో సెలబ్రేషన్ ని పీక్స్ కి తీసుకెళ్లారు.

ఆ ఫోటోలు అంతర్జాలంలోకి రావడంతో అసలు సెగ మొదలైంది. పీసీని నెటిజనులు ఓ రేంజులో ఆడుకుంటున్నారు. గత ఏడాది దీపావళికి బాణసంచా కాల్చొద్దని.. వాతావరణ కాలుష్యం అవుతుందని లెక్చరిచ్చిన పీసీ.. అంతకుముందు పొగతాగితే కలిగే హాని గురించి స్పీచ్ లు దంచింది. వాటన్నిటినీ గుర్తు చేస్తూ తెగ తిట్ల పురాణం అందుకుంటున్నారు. అంతకుముందు నిక్యాంక పెళ్లిలోనూ భారీగా బాణ సంచా కాల్చడంపైనా నెటిజనులు ఫైరైన సంగతిని ఎవరూ మర్చిపోలేదింకా.

తనకంటే పదేళ్ల చిన్నవాడైన నిక్ ని పెళ్లాడాక పీసీకి ప్రతి సందర్భంలోనూ నెటిజనులు వెంటాడి ట్రోల్స్ తో తాట తీస్తూనే ఉన్నారు. తేడాగా కనిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి.. విచ్చలవిడితనం గురించి రకరకాలుగా తిట్టారు. ఇప్పుడు ఏకంగా పొగతాగుతూ చిలౌట్ చేయడం నెటిజనులకు నచ్చలేదు. అయితే పీసీ కావాలనే ఇలాంటి ఫోటోలను రిలీజ్ చేస్తోందా? తనని నిత్యం లైమ్ లైట్ లో ఉంచేందుకే ఇలా ఆర్జీవీలా ఏదైనా ట్రిక్కులు ప్లే చేస్తోందా? అన్నదానికి ఆన్సర్ రావాల్సి ఉంది. సమకాలీన నటీమణుల్లో ప్రియాంక చోప్రా స్థాయి సెలబ్రేషన్స్ వేరొక కథానాయిక ఎవరూ సాహసించిందే లేదు. హాలీవుడ్ స్టార్లకు ధీటుగా పీసీ చెలరేగుతున్న వైనం నిరంతరం చర్చకొస్తూనే ఉంది.
Please Read Disclaimer