సీమ గడ్డపై అసురన్ రచ్చస్య

0

ధనుష్ కథానాయకుడిగా నటించిన అసురన్ ఇటీవల విడుదలై మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇదొక రివేంజ్ స్టోరీ. మాస్ పాత్రలో ధనుష్ ఒదిగి పోయాడు. తను మాత్రమే ఈ పాత్ర చేయగలడు! అన్నంత మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వెంకీ కి భార్య గా ప్రియమణి నటించనుంది.మాతృక నిర్మాత కలైపులి యస్ థాను-సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందిట. అప్పటి నుంచి ఏకధాటిగా షూటింగ్ జరగనుంది. అయితే చిత్రీకరణ ఎక్కువ భాగం రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో చేయాలని యూనిట్ నిర్ణయింది. ఈ స్క్రిప్ట్ కు అనంతపురం బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుందని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ వాతావరణం ప్రతిబించాలి..అందులో పొగరు పౌరుషం కనిపంచాలంటే సీమ ప్రాంతమే కరెక్ట్ అని భావించి ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అవసరమైన చోట ప్రత్యేకంగా సెట్లు కూడా నిర్మించనున్నారని సమాచారం. ఇక రివేంజ్ డ్రామాలకు అనంతపురం కొత్తేం కాదు. యాక్షన్ ఫ్యాక్షన్ నేపథ్యం గల ఎన్నో సినిమాలు ఇక్కడ తెరకెక్కాయి. మెగాస్టార్ చిరంజీవి- నటసింహా బాలకృష్ణ లాంటి స్టార్లు సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో సీమకు వెళ్తున్నాడు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తిచేసి సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారుట.
Please Read Disclaimer