పవన్ కళ్యాణ్ వాయిస్ తో ‘అశ్వ త్థామ’

0

హీరో నాగ శౌర్య తనకు తట్టిన ఓ కథను రెడీ చేసుకొని నిర్మాతగా సినిమా చేసేసాడు. రమణ తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అశ్వత్థామ’ ఈ నెల 31 న థియేటర్స్ లోకి వస్తుంది. సొంత కథతో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా చాలా ఆశలు పెట్టుకున్నాడు నాగ శౌర్య. అయితే సినిమాకు మాత్రం పెద్దగా బజ్ లేదు. గతంలో శౌర్య నుండి వచ్చిన ‘నర్తన శాల’ ఎఫెక్ట్ కూడా ఉంది ఉండొచ్చు.

ఈ సినిమా గురించి లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయలు పంచుకున్నాడు శౌర్య. సినిమా పవన్ కళ్యాణ్ వాయిస్ స్టార్ట్ అవుతుందని. దానికోసం ‘గోపాల గోపాల’ లో నుండి పవన్ కళ్యాణ్ క్లిప్ వాడుకున్నామని తెలిపాడు. అయితే ఆయన డైలాగ్ టైటిల్ కి క్లారిఫికేషన్ ఇస్తూ సినిమా పై ఆసక్తి నెలకొనేలా ఉంటుందని అన్నాడు.

ఇక త్వరలోనే తన సొంత బ్యానర్ లో మరో హీరోను పెట్టి సినిమా చేస్తానని చెప్పుకున్నాడు. ఆ సినిమాకు తనే కథ ఇస్తానని అశ్వత్థామ’ రిజల్ట్ పై తన రైటర్ కరీర్ ఆదారపడి ఉందని అన్నాడు. సో శౌర్య హీరో గా నిర్మాత గా సక్సెస్ అయిన శౌర్య ఇప్పుడు ఈ సినిమా తో రైటర్ గా సక్సెస్ అవుతాడో లేదో చూడాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer