ట్రైలర్ మెప్పించినా చేతులెత్తేశారు!

0

గత కొంత కాలంగా పాన్ ఇండియా ఫీవర్ ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది- దక్షిణాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా రిలీజ్ చేసి కలెక్షన్లు కొల్లగొట్టాలన్న పంతం కనిపిస్తోంది. ఆ కసిలోంచి ఎంచుకునే సబ్జెక్టుల పరంగా యూనివర్శల్ అప్పీల్ ఉండాలన్న తపన కనబడుతోంది. బాహుబలి అసాధారణ విజయం అనంతరం పరిణామమిది. అటు కన్నడలోనూ కేజీఎఫ్ ఘనవిజయం ఆషామాషీ ప్రభావం చూపలేదు.

రాకింగ్ స్టార్ యష్ తరహాలోనే తాను కూడా పాన్ ఇండియా స్టార్ గా వెలగాలని కలగన్నాడు కన్నడ యువ హీరో రక్షిత్. `అతడే శ్రీమన్నారాయణ` అంటూ అతడు నటించిన ఓ కన్నడ సినిమాని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే అసలు ఈ సినిమా రిలీజైందా లేదా? అన్న సందిగ్ధత నెలకొంది అంటే ప్రచారంలో చిత్రబృందం ఎంత వీక్ గా తేలిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. అందులోనే కథేంటో రివీల్ చేసేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిధి జాడను కనిపెట్టే ప్రయత్నాలు ఎలా సాగాయి? అసలు ఈ శ్రీమన్నారాయణ నేపథ్యం ఏమిటీ? ఆ నిధికి శ్రీమన్నారాయణకు ఉన్న సంబంధం ఏమిటీ? ఆ నిధిని చేరుకునే క్రమంలో అతను ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమిటీ? చివరికి నిధి దక్కిందా లేదా? అన్న కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కింది.

ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సెస్ .. మోడ్రన్ టేకింగ్ తో మైమరిపించింది. ట్రైలర్ క్లిక్కయినా… దానిని ఎన్ క్యాష్ చేసుకోవడంలో కానీ బజ్ క్రియేట్ చేయడంలో కానీ పూర్తిగా చిత్రబృందం తేలిపోయింది. ఏదో ప్రచారం చేసాం అంటే చేశాం అన్నట్టుగా లైట్ తీస్కోవడం మైనస్ అయ్యింది. ట్రైలర్ లో యంగ్ హీరో రక్షిత్ ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నా.. అతడి ప్రయత్నం నిరాశనే మిగిల్చింది మరి. తెలుగు రిలీజ్ సన్నివేశం ఇలా ఉంటే అటు కన్నడ సహా ఇతర భాషల్లో ప్రచారం ఎలా ఉంది? అంటే అక్కడా ఇదే తీరుగా ఉందట. మొత్తానికి.. మంచి సినిమా తీయడమే కాదు ప్రచారం చేయడం ఇంపార్టెంట్ అని అనుభవజ్ఞులు పదే పదే ఎందుకు చెబుతారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-