హీరోయిన్ కంపెనీలపై ప్రత్యర్థుల దారుణ కుట్ర

0

ఓ కంపెనీ ఎదుగుతోందంటే దాన్ని ఎలాగైనా తొక్కేయాలని ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతూ వుంటుంది. అదీ చేతకాకపోతే ఐటీ అధికారులకు ఉప్పందించి సదరు సంస్థపై ఐటీ దాడులకు ప్లాన్ చేస్తుంటారన్నది చాలా సినిమాల్లో చాలా చూశాం. అయితే అచ్చు గుద్దినట్టు సినిమాలో లాంటి సంఘటనే ఓ మాజీ హీరోయిన్ కంపెనీ విషయంలో చోటు చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పవన్ కల్యాణ్ తో మరో సారి నటించే ఛాన్స్ వస్తే బాగుండని బాహాటంగానే ప్రకటించిన సదరు మాజీ హీరోయిన్ తన సోదరునితో కలిసి (ఈమె బినామీ) గత కొంత కాలంగా ఓ కంపెనీని రన్ చేస్తోంది. తన కంపెనీ ప్రచారానికి తనే బ్రాండ్ ప్రమోటర్. వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఆ కంపెనీ ఆరంభం బాగానే నడిచింది. శరవేగంగా యాభై బ్రాంచీల వరకూ ఎదిగింది. దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో వేగంగా విస్తరించింది. అయితే ఈ వేగం చూసి ప్రత్యర్థికి కన్ను కుట్టినట్టే కనిపిస్తోంది.

లాభాల బాటలో పయనిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వడంతో ఇలా అయితే లాభం లేదనుకుని కుట్రకు పాల్పడ్డారట. పోటీ కంపెనీ ఎదుగుదల గిట్టని ప్రత్యర్థి వర్గం ఆ హీరోయిన్ కంపెనీపై ఐటీ- జీఎస్టీ అధికారులకు ఉప్పందించడమే గాక ఉసిగొల్పారట. ఇంకేం ఉంది ఆ హీరోయిన్ తన సోదరుడితో కలిసి రన్ చేస్తున్న కంపెనీపై విరుచుకుపడి దాడులు చేశారు. అయితే తన కంపెనీపై దాడులు చేసిన అధికారుకే బిస్కెట్ వేయాలని ప్రయత్నించి సదరు హీరోయిన్ అడ్డంగా బుక్కైపోయింది అంటూ మరో రూమర్ పుట్టుకొచ్చింది. అయితే అనూహ్యంగా కథ అఢ్డం తిరగడంతో ఏర్పడిన డ్యామేజీ నుంచి బయటపడటం కోసం సదరు హీరోయిన్ విశ్వప్రయత్నాలే చేస్తోందన్న మాటా వినిపిస్తోంది. బిల్లుల్లో తప్పుడు లెక్కలపై సదరు ఐటీ కంపెనీ దృష్టి సారించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందట. మరి ఇందులో వాస్తవం ఎంత అన్నదానిపై సదరు ఐటీ అధికారులే ఫుల్ క్లారిటీతో వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసుల నుంచి సదరు హీరోయిన్ కానీ ఆమె సోదరుడు కానీ ఎలా బయటపడబోతున్నారు? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అసలేం జరుగుతుందో అని అంతా ఉత్కంఠ గా మాట్లాడుకుంటున్నారు.
Please Read Disclaimer