భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

బీరు సీసాలతో రాహుల్ సప్లిగంజ్ మీద దాడి.. తీవ్ర గాయాలు

0

హైదరాబాద్ లోని ఒక పబ్బులో చోటు చేసుకున్న గొడవ సంచలనంగా మారింది. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. అతగాడి తలపై బీరుసీసాలతో కొట్టటంతో తలకు గాయమైంది. గచ్చిబౌలిలోని ఒక పబ్బులో జరిగిన గొడవ ఈ తీవ్ర ఘటనకు కారణంగా మారింది.

తన స్నేహితులతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలిలోని ఒక పబ్ కు బుధవారం రాత్రి 11.45 గంటలకు వచ్చాడు. అతడి వెంట ఒక యువతి కూడా ఉన్నారు. రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అక్కడున్న కొందరు అనుచితంగా ప్రవర్తించటంతో గొడవ మొదలైంది. తన స్నేహితురాలి పట్ల వ్యవహరించిన తీరును రాహుల్ నిలదీశారు.

మాటా మాటా అనుకోవటంతో మొదలైన గొడవ కాసేపటికే దాడుల వరకూ వెళ్లింది. గొడవ జరిగిన అరగంటకు ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఇదే సమయంలో రాహుల్ తలపై బీరు సీసాతో కొట్టటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత పెద్దదేనని చెబుతున్నారు. గొడవ గురించి సమాచారం అందటంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ వ్యవహారంలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-