మా కెమిస్ట్రీ ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు

0

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ మూవీ ‘బాలా’ వంద కోట్ల దిశగా దూసుకు పోతుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే సమయం లో సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా భూమీ పడ్నేకర్ నటించిన విషయం తెల్సిందే. బాలాతో కలిపి ఈ అమ్మడు ఆయుష్మాన్ ఖురానా తో మూడు సినిమాలు చేసింది. మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

తాజాగా బాలా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భూమీ ఫడ్నేకర్ తో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బం గా ఆమె ఆయుష్మాన్ ఖురానాపై ప్రశంసల జల్లు కురిపించింది. ఆయనతో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెరపై మా జంట చాలా బాగుందని.. మా ఇద్దరి మద్య కెమిస్ట్రీ చాలా బాగుంది అంటూ చాలా మంది నాతో అన్నారు. ఇప్పటి వరకు మేము కలిసి మూడు సినిమాలు చేశాం. ఆ మూడు సినిమాల్లో కూడా మా మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పుకొచ్చింది.

మా ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం వల్లే ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా మూడు సినిమాలను ఆధరించారు అంది. సామాజీక సమస్యల ను తీసుకుని ఎంటర్ టైన్ మెంట్ వే లో చూపించడం వల్లే మేము నటించిన మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. మూడు సినిమాలు కూడా మూడు విభిన్నమైనవి అవ్వడం వల్ల ఈ జంట కు మంచి పేరు రావడం తో పాటు హిట్ పెయిర్ గా గుర్తింపు దక్కించుకుంది.

Comments are closed.