అవతార్ 2 మరో అద్భుతం కాబోతోందా?

0

గత కొంతకాలంగా అవతార్ సీక్వెల్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 2009లో రిలీజైన అవతార్ కి దశాబ్ధం తర్వాత సీక్వెల్ రాబోతోంది. అవతార్ 2 చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. అయితే టాకీ పూర్తయినా విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు మరో ఏడాది పట్టనుంది. 2021 డిసెంబర్ లో అవతార్ 2ని రిలీజ్ చేస్తామని ఇంతకుముందు జేమ్స్ కామెరూన్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమాలోని ఫోటోలను దర్శకుడు జేమ్స్ కామెరాన్ బయటి ప్రపంచానికి రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు ఆద్యంతం మరో కొత్త లోకంలోకి తీసుకెళుతున్నాయి. ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహం.. దానిపై నీలిరంగు మనుషుల్ని ఎంతో గొప్పగా చూపించిన కామెరూన్ ఈ సీక్వెల్లో అంతకుమించిన మరో విజువల్ అద్భుతాన్ని చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఇక బ్లూ వాటర్ బ్యాక్ డ్రాప్ లో అవతార్ మనుషుల సాహసాల్ని ఆవిష్కరించనున్నారని అర్థమవుతోంది.

తొలి భాగంలో భారీ విహంగాల్ని తలపించే డేగలపై అవతార్ ల సాహసాలు.. గగుర్పొడిచే భీకర పోరాటాలు చూశాం. పండోరా వినాశనానికి కారకులైన వారిపై పగ ప్రతీకారం తీర్చుకోవడం అన్న కాన్సెప్టుతో తొలి భాగం తెరకెక్కింది. పార్ట్ 2 కూడా ఇదే తరహాలో తీసినా ఈసారి అదనపు హంగులు జోడించారని తాజా ఫోటోలు చెబుతున్నాయి. ఈసారి భారీ నదులు కొండలు సరస్సుల్లో నీటి గుర్రాల్ని చూపించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ఏడాది పాటు వేచి చూస్తే కానీ థియేటర్లలో ఆ అద్భుతాల్ని వీక్షించే వెసులు బాటు లేదు. 2011 డిసెంబర్ 17 వరకూ వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer