అవతార్ స్టార్స్ టాలీవుడ్ సినిమా

0

హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామోరూన్ తెరకెక్కించిన `అవతార్` సంచలనాల గురించి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. 2డి- 3డిలో విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్.. సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని అధ్యాయం. ఆస్కార్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు-రివార్డులను సొంతం చేసుకుంది. టైటానిక్ తరువాత అవతార్ కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అది. టైటానిక్ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన సృష్టి కర్తనే అవతార్ అనే అద్భుతాన్ని సృష్టించడం పై దశాబ్ధాల పాటు మాట్లాడుకుంటూనే ఉంది ఈ ప్రపంచం. అవతార్ లో ప్రతీ నటుడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కాయి.

ఇదే విజువల్ వండర్ లో హైదరాబాద్ కు చెందిన ఓ నటుడు నటించడం తెలుగు వాళ్లంతా గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం జేమ్స్ కామోరూన్ అవతార్-2 తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ ప్రాంచైజీ నుంచి మరిన్ని సీక్వెల్స్ రానున్నాయి. అయితే తాజాగా అవతార్ లో నటించిన కొందరు నటీనటులతో తెలుగు- తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రీల్ కట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అమెరికా- యూకే- బ్రెజిల్- మలేషియాకు చెందిన నటీనటులు ఇందులో నటిస్తున్నారు. అయితే నటీనటుల పేర్లు.. వాళ్ల పాత్రలకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యం గా ఉంచారు.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాల్ని వెల్లడించనున్నారు. ఈ చిత్రంతో నరేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 19న లడాక్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారత్ తోపాటు.. నేపాల్- వియత్నాం- సింగపూర్ సహా దాదాపు 70 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారుట. సినీ ప్రియులకు ఈ సినిమా ఓ ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు.
Please Read Disclaimer