డే1 ‘ఎండ్ గేమ్’ రికార్డ్ బ్రేకింగ్!

0

అవెంజర్స్ .. అవెంజర్స్ .. అవెంజర్స్.. ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదొక్కటే వినిపిస్తోంది. ఈ సిరీస్ లో చిట్టచివరి సినిమా `ఎండ్ గేమ్` ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా 2డి-3డి-3డి ఐమ్యాక్స్ ఫార్మాట్లలో ఒకేసారి రిలీజవుతుండడంతో సర్వత్రా రికార్డులపైనా ఆసక్తి నెలకొంది. మార్వల్ సినిమాటిక్ యూనివర్శ్ (ఎంసీయూ) నుంచి రిలీజవుతున్న ది బెస్ట్ మూవీగా అవెంజర్స్ – ఎండ్ గేమ్ గురించి ప్రచారం సాగుతోంది. ఫేమస్ రోటెన్ టమోటాస్ వెబ్ సైట్ సైతం ఈ సినిమాని క్రేజు దృష్ట్యా.. బాక్సాఫీస్ ఓపెనింగుల దృష్ట్యా ఇప్పటివరకూ నంబర్- 1 అంటూ కీర్తించేసింది. అంటే రిలీజ్ ముందే ఈ మూవీపై ఎలాంటి అంచనాలేర్పడ్డాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా భారతదేశంలో .. తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే క్రేజీగా రిలీజవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కి ముందు రాత్రంతా స్పెషల్ షోలతో అదరగొట్టేస్తున్నారు. పైగా డే-1 టిక్కెట్లు అన్నీ అయిపోయాయంటూ బుక్ మై షో సహా ఆన్ లైన్ టికెటింగ్ విండోలన్నీ లాక్ అయిపోవడం ప్రధానంగా చర్చకు వచ్చింది. అవతార్ తర్వాత మళ్లీ అంత ఇదిగా జనాల్లో వైరల్ గా మాట్లాడుకుంటున్న సినిమా కూడా ఇదే కావడంతో అంతకుమించిన ఓపెనింగుల రికార్డులు బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే 6900 కోట్లు (1 బిలియన్ డాలర్స్) వసూలు చేస్తుందన్నది నిపుణుల విశ్లేషణ.

ఇండియాలో ఈ సినిమా దాదాపు రూ.500 కోట్లు వసూలు చేయడం ఖాయమని ఇప్పటికే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు ఇండియాలో బాహుబలి- దంగల్ – థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి బెస్ట్ ఓపెనర్ల రికార్డుల్ని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు. ప్రఖ్యాత ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ జోహార్ మాట్లాడుతూ..“ఇండియాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్ టైమ్ ఓపెనింగ్ డే రికార్డును ఈ చిత్రం క్రియేట్ చేయనుంది. అమీర్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేస్తుంది“ అని విశ్లేషించారు. 3డి ఫార్మాట్ లో రిలీజైన అవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్ రికార్డుల్ని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని.. తొలి వారంలో 1 బిలియన్ డాటర్ రికార్డును తిరగరాస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అమెరికాలో ఇప్పటివరకూ ఉన్న రికార్డుల్ని చెరిపేస్తుంది. అలాగే చైనాలో 250 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వసూళ్లను తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఊహాతీతం అన్నంత రేంజులో ఉంది `ఎండ్ గేమ్` మానియా.
Please Read Disclaimer