బూరె బుగ్గల అవిక మాజీతో ఏం చేస్తోంది?

0

`ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అవికా గోర్. తొలి ప్రయత్నమే కుర్రకారు హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అంతకుముందే అనువాద సీరియళ్లతోనూ తెలుగు నాట ఈ భామ సుపరిచితం కావడంతో యూత్ లో బాగానే పాపులరైంది. కానీ ఇంతలోనే ఫ్లాపుల రూపంలో కెరీర్ పరంగా రేసులో వెనకబడింది.

ఈలోగానే హిందీలో ప్రయత్నాలు ప్రారంభించింది. తన ప్రయత్నం సఫలమైంది. ఎట్టకేలకు తొలి బాలీవుడ్ చిత్రంతో అభిమానుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో మనీష్ రైసింగన్ కథానాయకుడు. మనీష్ కొత్త వాడేమీ కాదు. `ససురాల్ సిమర్ కా` సీరియల్ లో ఆ ఇద్దరూ కోస్టార్స్. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా డేటింగ్ నడుస్తోందని రూమర్స్ వచ్చాయి. అయితే పదే పదే చాలా లైవ్ ఈవెంట్లలో అదేమీ నిజం కాదని ఇద్దరూ చెప్పారు. అలాగే మనీష్ చాలా సార్లు అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటానని అన్నాడు.

అయితే ఆ ఇద్దరూ కలిసి చాలా గ్యాప్ తర్వాత కలిసి జంటగా నటిస్తూ.. ప్రచారం కోసం ఇలా అభిమానుల ముందుకు వస్తున్న క్రమంలో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరూ కలిసి నటించనప్పుడు ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు వచ్చి విడిపోయారు అంటూ ప్రచారం సాగించిన వాళ్లే వీళ్లు కలిసి కనిపించడం చూశాక అభిప్రాయం మార్చుకున్నారు. ఇక తన డెబ్యూ గురించి చెబుతూ అవిక ఎంతో ఎమోషన్ అయ్యింది. హిందీలో నా తొలి చిత్రం సోషల్ మెసేజ్ ఇచ్చే కథాంశంతో తెరకెక్కింది. ఇది చాలా ఎగ్జయిట్ చేస్తోంది అంటూ అవికా గోర్ చెప్పింది. అన్నట్టు ఈ అమ్మడు తిరిగి టాలీవుడ్ కి వచ్చేది ఎప్పుడో?
Please Read Disclaimer