ఇకపై చిన్న పిల్ల అనరులే

0

హిందీ సీరియల్ తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘చిన్నారి పెళ్లి కూతురు’ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన చిన్నారి అవికా గౌర్. ఆ సీరియల్ తో మంచి గుర్తింపు దక్కించుకుని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఉయ్యాల జంపాల సినిమాతో సక్సెస్ దక్కించుకున్న అవికా గౌర్ ఆ వెంటనే వరుసగా సినిమాలు చేసింది. కాని కొన్ని సినిమాలు ఆమెకు నిరాశ మిగిల్చాయి. అదే సమయంలో ఈ అమ్మడు మరీ ఎక్కువ లావు అయ్యింది. కొన్ని సినిమాల్లో ఈమె హీరోకు అక్కగా ఆంటీగా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. దాంతో ఏడాది కాలం పాటు పూర్తిగా బ్రేక్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది.

రాజుగారి గది 3 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గౌర్ కు మునుపటి స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఇంకా ఈమెను చిన్నారి పెళ్లి కూతురుగానే చూస్తున్నారు. హాట్ లుక్ లో.. స్కిన్ షో లో చూసేందుకు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఆసక్తి చూపడం లేదు. కాని ఈమె మాత్రం సినిమాల్లో కాకున్నా ఫొటో షూట్ లతో తన హాట్ లుక్ ను రివీల్ చేస్తోంది. తాను ఇంకా చిన్న పిల్లను కాదు.. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చి పోయి చేస్తాను.. స్కిన్ షోకు అడ్డు లేకుండా చేస్తాను అన్నట్లుగా ఈ ఫొటో షూట్ స్టిల్స్ తో చెప్పకనే చెబుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి పెళ్లి కూతురులో ఇప్పటి వరకు క్యూట్.. ఫ్యామిలీ టైప్ అమ్మాయినే చూశాం. మొదటిసారి ఇలా హాట్ లుక్ ను కూడా చూస్తున్నామంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన తర్వాత అయినా ఎవరో ఒకరు ఈమెకు హాట్ హీరోయిన్ పాత్రను చేసే అవకాశం ఇస్తాడేమో చూడాలి. అవకాశాల కోసం అవికా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి అవికా ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.
Please Read Disclaimer