రూపం మార్చుకున్న కుర్ర బ్యూటీ అవికా

0

బుల్లితెరపై బాలనటిగా ఓ వెలుగు వెలిగి అటుపై వెండితెరపై కథానాయికగా ఆకట్టుకుంది అవికా గోర్. రాజ్ తరుణ్ `ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అటుపై సక్సెస్ లేక తెరమరుగైంది. నాకు అవకాశాలు రాకుండా కుట్ర చేశారంటూ అప్పట్లో వివాదాల్లోకి రావడం.. అటుపై అనూహ్యంగా కెరీర్ పరంగా జీరో అయిపోవడం టాలీవుడ్ లో చర్చకు వచ్చింది.

అవికా గోర్ ప్రస్తుతం ఏం చేస్తోంది? అంటే ఇటీవల పూర్తిగా ఫిట్ నెస్ పై దృష్టి సారించిన మేకోవర్ కోసం చాలానే శ్రమించిందని అర్థమవుతోంది. తాజాగా రివీల్ చేసిన ఫోటోలు చూశాక అభిమానులు షాక్ తినాల్సిందే. అసలు ఆ బొద్దుగుమ్మనేనా.. ఈ తీరుగా మారిపోయింది? అన్నంతగా కొత్త రూపంతో తళుక్కుమంది. ఆ బూరెబుగ్గలు కాస్తా ఉబ్బు తగ్గిపోయాయి. ఫ్యాట్ నెస్ పూర్తిగా తగ్గిపోయి సన్నజాజిలా తయారైంది. మారిన ఈ కొత్త రూపం చూస్తే మరోసారి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఫిదా అయిపోయి తిరిగి ఛాన్సివ్వడం ఖాయమేననడంలో సందేహమేం లేదు.

అయితే అవిక గత కొంతకాలంగా ఉత్తరాదిన బుల్లితెర కార్యక్రమాల్లో అడపాదడపా కనిపించడం తప్ప సీరియస్ గా సౌత్ లో ప్రయత్నిస్తున్న వైనం కనిపించలేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ అమ్మడి పేరు వినిపించడం లేదు. ఇటీవలే కృతిక సోలంకి కొరియోగ్రఫీలో అవికా గౌర్ డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో అంతర్జాలంలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలోనూ అవిక గోర్ మేకోవర్ అబ్బురపరిచింది. మునుపటితో పోలిస్తే అవికలో పూర్తి పరిణతి కనిపిస్తోంది కూడా. నేడు బర్త్ డే సందర్భంగా అవికా గోర్ న్యూ మేకోవర్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోలు చూసి షాక్ తింటున్నారంటే అతిశయోక్తి కాదు.