‘బిగ్ బాస్’ హోస్ట్ అవ్వాలనుందట!

0

‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్ తో తెలుగులోనూ పాపులర్ అయిన అవిక గోర్ ‘ఉయ్యాల జంపాల’ తో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన అవిక కొంత గ్యాప్ తర్వాత ‘రాజు గారి గది3’ తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈ బ్యూటీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

హిందీ ‘బిగ్ బాస్’ షో కి హోస్ట్ చేయడం తన డ్రీం అని చెప్పింది. ఒక వేళ తనకి అంతటి హోదా వస్తే అదే తనకి కెరీర్ లో ఎక్కువ సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఆ బిగ్ బాస్ కి కంటెస్టెంట్ గా మాత్రం వెళ్ళే ఉద్దేశ్యం లేదని అలా అయితే తను ఎన్నో ఏళ్లుగా కలర్స్ చానెల్ లో పనిచేస్తున్నానని ఆ దారి తనకి తనకి చాలా సులువని అని చెప్పింది.

అయితే తెలుగులో గ్యాప్ తీసుకోవడం గురించి మాట్లాడింది. హిందీలో సీరియల్స్ అలాగే ఒక సినిమా చేసానని అందుకే తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ చేయలేకపోయానని తెలిపింది. తెలుగులో మరో సైన్ చేసినట్టు చెప్పిన ఈ ముద్దుగుమ్మ మరో పదిహేను రోజుల్లో ఆ సినిమా గురించి చెప్తానని అంటోంది.
Please Read Disclaimer