బన్నితోనా.. కాళ్లు ఇరగ్గొట్టుకోవాలా?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా బన్ని డ్యాన్సులంటే పడి చచ్చే సెలబ్రిటీలు.. స్టార్లు కూడా ఎందరో ఉన్నారు. ఆ స్టైల్లో అంత ఎనర్జీతో డ్యాన్సులు చేయాలని ప్రయత్నించి కాళ్లు ఇరగ్గొట్టుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

అందుకేనేమో.. ఈ అమ్మడు ఆ ప్రశ్నకు అంతగా కంగారు పడింది. ఒకవేళ మీకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్సులు చేసే అవకాశం వస్తే చేస్తారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అందాల అవికా గోర్ షాక్ తింది. “అల్లు అర్జున్ తోనా.. నేనా.. పిచ్చేమైనానా? .. నా కాళ్లు విరగ్గొట్టుకోమంటారా? బన్నితో డ్యాన్సులు చాలా కష్టం!!“ అంటూ సరదాగా నవ్వేసింది.

ల్యాండ్ మార్క్ స్టెప్పుల్ని దించడంలో బన్ని తర్వాతనే. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు అతడు పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు యూనిక్ గా ఉండే స్టెప్స్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటాడు. ఆర్య-ఆర్య 2 మొదలు ప్రతి సినిమాలో ఏదో ఒక బ్రాండెడ్ స్టెప్ తో మెప్పించాడు. వాటిని అనుకరిస్తూ డ్యాన్స్ రియాలిటీ వేదికలపైనా ఎందరో తమ ప్రతిభను చూపారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అల వైకుంఠపురములో చిత్రంలోనూ అదిరే స్టెప్పులతో బన్ని అలరించబోతున్నాడట. అందరు ఫ్యాన్స్ లానే అవికా గోర్ కూడా స్పందించిందన్నమాట. ఉయ్యాల జంపాల లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన అవిక కెరీర్ ఊహించని విధంగా డైలమాలో పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer