ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

0

అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరి’. ఆసక్తికరమైన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘ఏ పిల్లా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు పవన్.Ch సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు చైతన్య పింగళి. పాడినవారు హరిచరణ్. “ఏయ్ పిల్లా పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా రారా కంచే దుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లుని తీసి నీ వైపు వంతెన వేసి రావా” సింపుల్ పదాలతో సాహిత్యం ఆహ్లాదకరంగా సాగింది. ఈ పాటకు తగ్గట్టుగా పవన్ ఓ మంచి ట్యూన్ అందించారు. హరిచరణ్ కూడా చక్కగా పాడారు. స్లో సాంగ్స్.. మెలోడీస్ ఇష్టపడేవారికి నచ్చుతుందేమో కానే ఈ పాట మిగతావారికి ఒక్కసారి వినగానే కనెక్ట్ అయ్యేది కాదు. తినగతినగ వేము తియ్యనుండు తరహాలో వినగ వినగా ఏయ్ పిల్లా నచ్చవచ్చు!

అయితే కమ్ముల సారూ సినిమాలు మంచి కాఫీ తరహాలో ఉంటాయి.. పాటలు నెస్కెఫె యాడ్ ల తరహాలో ఉంటాయి కాబట్టి ఈ పాట కూడా అలానే ఆయన స్టైల్ లోనే ఉంది. మధ్యలో మిడిల్ క్లాస్ బాయ్ అవతారంలో చైతు.. మిడిల్ క్లాస్ గర్ల్ అవతారంలో సాయిపల్లవి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు చూసేయండి ఏయ్ పిల్లా పాట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-