మైఖేల్ జాక్సన్ లా ప్లాస్టిక్ సర్జరీలేమిటి?

0

నాగార్జున కథానాయకుడిగా నటించిన సూపర్ సినిమాతో నాయికగా పరిచయమైన అయేషా టాకియా గుర్తుండే ఉంటుంది. అందులో నాగ్ తో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన అమ్మడు తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. సూపర్ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం సాధించకపోవడంతో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. అటుపై బాలీవుడ్ కే పరిమితమైంది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో తెలుగులో సత్తా చాటాలని మరోసారి ప్రయత్నించింది. కానీ ఇక్కడ ఏదీ కలిసి రాలేదు. దీంతో బ్యాక్ టు పెవిలియన్ తప్పలేదు.

బాలీవుడ్ లోనూ కొన్నాళ్ల పాటే హవా సాగింది. అక్కడ చివరిసారిగా `మోడ్` అనే సినిమలో నటించింది. ఆ చిత్రం తర్వాత అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే కెరీర్ చరమాంకంలోనే అయేషా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబు అజ్మీ కుమారుడు పర్హాన్ ఆజ్మీని వివాహం చేసుకుంది. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే పెళ్లి తర్వాత కూడా అయేషా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇక కెరీర్ ఆరంభం నుంచి అయేషా ముఖమార్పిడికి ప్లాస్టిక్ సర్జరీల్ని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా ఉండేది. అందాల్ని రెట్టింపు చేసుకునేందుకు ఎంతకైనా తెగించే నాయికగా బాలీవుడ్ లో కథనాలు వేడెక్కించేవి.

అయేషా ప్లాస్టిక్ సర్జరీతోనే ముఖానికి కొత్త రూపం తెచ్చుకుందన్న వార్త బాలీవుడ్ సహా టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగింది. ఆమె ముఖ మార్పిడికి ముందు.. ఆ తర్వాత కొత్త రూపానికి సంబంధించిన ప్రూఫ్ లు తాజాగా బయటపడ్డాయి. వాటిలోంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. దీంతో గతంలోలానే మరోసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇక తాజాగా అంతర్జాలంలో లీకైన ఫోటోలు పాతవా.. లేక ఇప్పుడు మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? అన్న డిస్కషన్ కి తావిస్తోంది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత అయేషా పూర్తిగా కుటుంబానికి సమయం కేటాయించిందని… సినిమాల పట్ల ఆసక్తి చూపించలేదని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.