లవ్ స్టోరి :టీజర్

0

నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకుడు. ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ మూవీతోనే సినీనిర్మాణంలోకి అడుగు పెడుతోంది. ఫిదా లాంటి క్లాసిక్ లవ్ స్టోరి తర్వాత కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చక్కని అంచనాలే ఉన్నాయి.

`ఫిదా` చిత్రంలో వరుణ్ తేజ్ తో రౌడీ పిల్ల రొమాన్స్ ఓ రేంజులో పండింది. మరోసారి అలాంటి రొమాన్స్ చైతూతో సాయి పల్లవికి కుదురిందా లేదా? అన్న చర్చా అభిమానుల్లో సాగుతోంది. అసలింతకీ చైతూతో సాయి పల్లవి రొమాన్స్ ఎలా ఉంది? లవ్ స్టోరి కుదిరిందా లేదా? అంటే ఇదిగో తాజాగా రిలీజైన సాంగ్ టీజర్ చూస్తే ఎవరైనా చెప్పొచ్చు. సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా తనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతుంది. లవ్ స్టోరీ కి సాయి పల్లవి ప్రధాన బలం అని చెప్పొచ్చు.

ఏయ్ పిల్లా..! సాంగ్ టీజర్ లో చైతన్య తో రౌడీ పిల్ల ఓ రేంజులో రొమాన్స్ పండించింది. రన్నింగ్ ట్రైన్ లో చుట్టూ జనం ఉండగానే స్ట్రాంగ్ చుమ్మా ఒకటి కొట్టి మరోసారి రౌడీ వేషం ఎలా ఉంటుందో చూపించింది. పైగా.. ముద్దు పెడితే ఏడుస్తారా అమ్మా! అంటూ అమాయకుడైన చైతూపై పంచ్ కూడా విసిరింది. ఇక ఆ ఛుమ్మా అందుకున్న చైతూ ఫేస్ లో ఎమోషన్ అంతే ఇదిగా ఆకట్టుకుంది. రొటీన్ లవ్ స్టోరీలు చాక్లెట్ బోయ్ వేషాల కంటే కాస్త ఎమోషన్ ని నమ్ముకుంటే మంచి పేరొస్తుందని మజిలీ చిత్రం నిరూపించింది. అందులో సమంతతో కలిసి ఎన్నో ఎమోషనల్ సీన్స్ లో చక్కని పరిణతి తో నటించిన చైతూకి మరోసారి అలాంటి ఎమోషనల్ పెర్ఫామెన్స్ కి ఆస్కారం దొరికినట్టే కనిపిస్తోంది. కమ్ముల శైలి సెన్సిబిలిటీస్ తో లవ్ స్టోరి నచ్చుతుందనే భావిస్తున్నారు. ఇక ఇందులో చైతూ – సాయి పల్లవి పక్కా తెలంగాణ యాస మాట్లాడుతారు. పల్లె నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలైన బాపతు ప్రేమికులుగా కనిపించనున్నారు. లవ్ స్టోరి సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈలోగానే ఈ సినిమా నుంచి ప్రమోషనల్ మెటీరియల్ ని బరిలో దించుతున్నారు. సాయి పల్లవి నుంచి అదిరిపోయే డ్యాన్స్ నంబర్ ని కూడా ఈ మూవీలో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
Please Read Disclaimer