ఆ క్రేజీ రీమేక్ డైరెక్టర్ మార్పు నిజమేనా?

0

విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనమ్ కోషియం` తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ.. రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తారంటూ ప్రచారం సాగుతోంది. దర్శకుడిని ఫైనల్ చేశారన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఇంతకుముందు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారని ప్రచారమైంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి దర్శకుడు మారారని తెలుస్తోంది. `అప్పట్లో ఒకడుండేవాడు`.. `అయ్యారే` లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్ని తెరకెక్కించిన సాగర్ చంద్ర పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. సీతార ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించాల్సి ఉంది.

నిజానికి నిన్న మొన్నటివరకూ స్వామిరారా ఫేం సుధీర్ వర్మ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ కి దర్శకత్వం వహించే వీలుందని ప్రచారమైంది. కానీ ఇంతలోనే నేమ్ ఛేంజ్ అయ్యింది. రకరకాల కారణాలతో మేకర్స్ మనసు మార్చుకున్నారని అర్థమవుతోంది. అలాగే సుధీర్ వర్మ ఈ ఛాన్స్ మిస్సయినా వేరే కమిట్ మెంట్లతో బిజీ అవుతున్నారన్న లీకులు అందుతున్నాయి.
Please Read Disclaimer