బాహుబలి ఐటెం ఏంజిల్ లుక్ అదుర్స్

0

కెనడియన్ మోడల్ అయిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి ఇండియన్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసింది. ఐటెం సాంగ్స్ తో సౌత్ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించిన ఈ అమ్మడు ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంది. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో మరింత క్రేజ్ ను ఈ అమ్మడు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

తాజాగా ఈ అమ్మడి ఫొటో షూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్ర ఒడ్డున తెల్లటి డ్రస్ లో క్లీవేజ్ షో తో ఏంజిల్ మాదిరిగా మెరిసి పోతున్న నోరా ఫతేహి స్టిల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందంతో పాటు ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ నోరా అంటూ పలు సినిమాలతో ప్రశంసలు దక్కించుకుంది.

తెలుగులో ఈ అమ్మడు బాహుబలి ఫస్ట్ పార్ట్ లో ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కిక్ 2.. షేర్.. లోఫర్ చిత్రాల్లో కూడా ఈ అమ్మడి ఐటెం సాంగ్ అదిరిపోయింది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం కనబర్చని ఈ అమ్మడు భారీగానే అభిమానులను సొంతం చేసుకుంది. లోఫర్ తర్వాత ఈ అమ్మడితో ఐటెం సాంగ్ చేయించేందుకు పలువురు టాలీవుడ్ మేకర్స్ వెళ్లినా కూడా నో చెబుతూ వచ్చింది. హిందీలో హీరోయిన్ గా కంటిన్యూ అవుతూ బిజీగా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-