బాహుబలి ప్రీక్వెల్ షూటింగ్ అయిపోయిందోచ్!

0

‘బాహుబలి’ రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ఇంకా కొనసాగింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ రాజమౌళి టీమ్ మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోలేదు. అయితే బాహుబలికి కథకు సీక్వెల్ అన్నట్టుగా ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ పేరుతో ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ వారు ‘బాహుబలి బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఒక వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారనే సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ వెబ్ సీరీస్ లో మొత్తం 30 ఎపిసోడ్స్ ఉంటాయని. మొదటి సీజన్లో 9 భాగాలు ఉంటాయి. మొదటి సీజన్ షూటింగ్ ఇప్పుడు పూర్తయింది. ఇందులో శివగామి చాలా యంగ్ గా కనిపిస్తుందట. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ శివగామి పాత్రలో నటిస్తోంది. ధీరవనిత అయిన శివగామి మహిష్మతి సామ్రాజ్యానికి ఎలా మహారాణి అయిందనేది ఈ సీజన్ లో ప్రధానంగా చూపిస్తారని సమాచారం. రెండు మూడు నెలల్లో ఈ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట.

బాహుబలికి సంబంధించిన ప్రీక్వెల్ కావడంతో ఈ వెబ్ సీరీస్ పై భారీగా ఆసక్తి నెలకొంది. సినిమా రేంజ్ లో ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగితే మాత్రం ప్రపంచవాప్తంగా ఈ సీరీస్ భారీ విజయం సాధించడం సులువే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home