బాహుబలి నిర్మాతల 2020 కానుక ఇదిగో

0

బాహుబలి ఫ్రాంఛైజీతో ఆర్కా మీడియా వర్క్స్ పాపులారిటీ విశ్వవిఖ్యాతం అయ్యింది. ఇటు తెలుగు ఇండస్ట్రీతో పాటు అటు తమిళం- హిందీ సహా అంతర్జాతీయ విఫణిలోనూ ఆర్కా అంటే ఒక బ్రాండ్ గా మార్మోగింది. ఆ సంస్థ నుంచి మరో సినిమా వస్తోంది ఎలా ఉంటుంది? అన్న ఊహాగానాలు అభిమానుల్లో సాగుతున్నాయి.

అయితే ఆర్కా సంస్థ నుంచి బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజు ప్రయత్నాలేవీ జరగలేదు. ప్రస్తుతం ఈ సంస్థలో మీడియం రేంజ్ సినిమాలు నిర్మించే ప్లాన్ వేయడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఈ నిర్మాణ సంస్థ కేరాఫ్ కంచరపాలెం ఫేం వెంకట్ మహా దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమాని ప్రమోట్ చేస్తూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

వెంకట్ మహా రెండో సినిమాని ఆర్కా సంస్థనే నిర్మిస్తోంది. ఇది మలయాళ హిట్ చిత్రం `మహేషింటే ప్రతికరణం`కి రీమేక్. దీనికి `ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య` అంటూ కాస్త భీకరమైన టైటిల్ నే ఎంపిక చేశారు. 2020 ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుందని చాలా ముందే ప్రకటించేయడం ఆసక్తికరం. తొలి ప్రయత్నం స్ట్రెయిట్ కథతోనే వచ్చిన వెంకట్ మహా ఈసారి రీమేక్ సినిమా చేస్తుండడం ఆసక్తికరం. మొదటి సినిమాలానే సెన్సిబిలిటీస్ కి ఎమోషన్స్ కి ఆస్కారం ఉన్న స్క్రిప్టునే ఎంచుకున్నాడని టైటిల్ ని బట్టి అర్థమవుతోంది.
Please Read Disclaimer