‘మహానాయకుడి’తో ‘దేశం’ నేతలు

0

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌ జీవిత కథని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో తనయుడు నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమా సెట్ కి తెలంగాణ టీడీపీ నాయకులు వెళ్లారు. కధానాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలుసుకున్నారు. ఆ సమయంలో బాలయ్య ఎన్టీఆర్ గెటప్ లో వున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వున్న గెటప్ ఇది. ఈ గెటప్ లో అచ్చు ఎన్టీఆర్ లానే వున్నారు బాలయ్య.

” ఆ మహానుభావుడికి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని, భావితరాలు గొప్ప కానుకగా ఈ సినిమా రూపుందుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలని” ఈ సందర్భంగా బాలయ్య వారితో అన్నారు. బాలయ్యనుని కలసిన వారిలో టీటీడిపీ నాయకులు ఎల్ రమణ, పెద్ది రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు వున్నారు.

కాగా ఎన్టీఆర్‌` బ‌యోపిక్ 2 భాగాలుగా రాబోతోంది. `కథానాయ‌కుడు` పార్ట్ 1గానూ, `రాజ‌కీయ నాయ‌కుడు` పార్ట్ 2గానూ విడుద‌ల చేస్తారు. `క‌థానాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న విడుద‌ల అయితే, `మహా నాయ‌కుడు` జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేస్తారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలపై భారీ అంచనాలు వున్నాయి.