బిగ్ బాస్: ఆలీ కుండ పగలింది..రాహుల్ కు వార్నింగ్

0

బిగ్ బాస్ క్లైమాక్స్ వేళ రోజు రోజుకు మరింత రక్తికడుతోంది. గత సోమవారం నామినేషన్స్ సందర్భంగా ట్రాలీ టాస్క్ లో బాబా భాస్కర్ కావాలనే తనని అడ్డుకున్నాడని – అందుకే తాను నామినేషన్స్ లోకి వెళ్లానని రాహుల్ గత రెండు ఎపిసోడ్ లుగా తన గ్యాంగ్ వరుణ్ – వితికాలతో చెప్పుకుంటూ సింపతీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు మెడాలియన్ టాస్క్ లో రాహుల్ నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నా బాబా మాత్రం మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. కానీ నామినేషన్ టాస్క్ లో బాబా ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా రాహుల్ మాత్రం దాని గురించే పదే పదే చెప్పి బాబాని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘టాస్క్ హంట్ అండ్ హిట్’ అనే టాస్క్ ఇచ్చారు. ఇది ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ స్పాన్సర్ చేసింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో జరిగే గుసగుసల్ని బహిర్గతం చేశారు. మూడు రౌండ్లుగా జరిగే ఈ టాస్క్ లో తొలి రౌండ్ లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక బూత్ ఏర్పాటు చేసి.. అందులో ప్రతి ఇంటి సభ్యుడి గురించి మిగతా వాళ్ళు ఏం గుసగుసలాడుకున్నారో ఓ ముఖ్యమైన వీడియోను ప్లే చేసి చూపించారు. తర్వాత ఆ వీడియోలో తమ గురించి మాట్లాడిన వ్యక్తిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఆ విషయం గురించి చర్చించాలి. నెక్స్ట్ తమ గురించి మాట్లాడిన వ్యక్తి ఫొటోను కుండకు అంటించి ఆ కుండను దిష్టిబొమ్మకు పెట్టి కర్రతో ఆ కుండను పగలగొట్టాల్సి ఉంటుంది.

దీంతో మొదట బాబా భాస్కర్ వెళ్లారు. ఆయన గురించి వితికా – రాహుల్ – వరుణ్ – అలీ మాట్లాడుకున్న వీడియోలని చూపించారు. వాళ్ళ మాటలు విన్న బాబా భాస్కర్.. అలీ – రాహుల్ మాటలకు హర్ట్ అయ్యారు. ‘అక్కడ నుండి వచ్చి ఇక్కడ గెలుస్తా’ అని బాబా అంటున్నాడు అంటూ అలీ ప్రాంతీయతను రెచ్చగొట్టే మాటలకు బాబా భాస్కర్ ఎమోషన్ అయ్యి…తాను ఎప్పుడు అలా అనలేదని అలీని పిలిచి చెప్పారు. నెక్స్ట్ రాహుల్ ని పిలిచి నామినేషన్స్ లో నిన్ను అసలు టార్గెట్ చేయలేదని – ఈసారి ఎప్పుడైనా అనుకుంటే టార్గెట్ చేశానని చెప్పి మరీ గేమ్ ఆడతానని రాహుల్ కు బాబా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎక్కువ అలీ మాటలకు హార్ట్ కావడంతో….అతని ఫొటోని దిష్టిబొమ్మకు పెట్టి ఫట్ మని పగలగొట్టేసి బాబా కసి తీర్చుకున్నారు.