బిగ్ బాస్ ఫుల్ ఫన్: శివజ్యోతిని ఆడేసుకుంటున్న బాబా…

0

అన్ని ఎపిసోడ్లు మాదిరిగానే బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ లో కొన్ని సీరియస్ చర్చలు – కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో నుంచి ముగ్గురు సభ్యులు సేఫ్ అయిన విషయం తెలిసిందే. వరుణ్ – రవి – రాహుల్ బిగ్ బాస్ ఇచిన సీక్రెట్ టాస్క్ పూర్తి చేసి ఇమ్యూనిటీ పొంది ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే పునర్నవి – మహేశ్ – హిమజలు త్యాగం చేస్తూ ఎలిమినేషన్ జోన్ లో నిలబడ్డారు.

ఇక రాహుల్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కొంత హౌస్ మేట్స్ తో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ టాపిక్ గురించే రాహుల్ – వితిక – పునర్నవిలు డిస్కస్ చేశారు. అలాగే తర్వాత రవి – శ్రీముఖి – పునర్నవి – హిమజల మధ్య చర్చ జరిగింది. అసలు ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురు సభ్యులకు బిగ్ బాస్ ఏం చెప్పారని శ్రీముఖి అడుగగా – పునర్నవి – రవిలు లోపల జరిగింది వివరించారు.

వీరి చర్చలు తర్వాత అసలు ఫన్ జరిగింది. ఎప్పటిలానే బాబా భాస్కర్ మధ్యాహ్నం సమయంలో ఓ కునుకు తీసే పని చేశారు. దీంతో హౌస్ లో కుక్కలు మోరిగిన సౌండ్లు గట్టిగా వచ్చాయి. ఈ సౌండ్ కు దెబ్బకు లేచారు. అలాగే కెప్టెన్ శివజ్యోతి బాబా దగ్గరకు వెళ్లింది. ఇంట్లో నుంచి మీరు వెళ్లిపోతారా? నన్ను పంపేస్తారా అని సెటైరికల్ గా మాట్లాడింది.

దీంతో బాబా తనకు వచ్చిన రాని తెలుగులో మాట్లాడుతూ శివజ్యోతిని ఆటపట్టించారు. జ్యోతి కూడా సరదాగా పంచ్ లు వేసింది. బాబా మాస్టర్ పడుకున్నది కాకుండా కుక్కలని తిడుతున్నారని సరదాగా మాట్లాడింది. అలా వీరి మధ్య సరదా చర్చ నడిచింది. వీరిని చూసి హౌస్ మేట్స్ కూడా కాసేపు నవ్వుకున్నారు.




Please Read Disclaimer