#BB3: 25 లక్షలు వదులుకున్న బాబా భాస్కర్

0

పాపం .. అయ్యో పాపం.. బిగ్ బాస్ 3 చివరి ఎపిసోడ్ ముగిసిపోతోంది. ఈ ఎపిసోడ్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. చివరికి శ్రీముఖి- రాహుల్ మధ్యనే పోటీ. 20 లక్షల ఆఫర్.. 25 లక్షల ఆఫర్ అంటూ హోస్ట్ నాగార్జున ఊరించినా బాబా భాస్కర్ అటూ ఇటూ ఊగినా చివరికి అతి విశ్వాసంతో ఆ ఆఫర్ ని వదులుకుని బయటకు వచ్చేశాడు.

ఇక బాబా బయటికి రాగానే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా బాబా భాస్కర్ కుమార్తె ఎమోషన్ అయిన తీరు కట్టి పడేసింది. ఇక విన్నర్ ఎవరు? శ్రీముఖినా.. రాహుల్ నా? ప్రస్తుతం ఇదో సస్పెన్స్. బిగ్ బాస్ ఇంటి బయట ఫ్యామిలీ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇక ఇంతలోనే నాగార్జున ఇంట్లో అడుగు పెట్టారు.

ఇంట్లో ఉన్న ఇద్దరికీ తలో 25 లక్షలు చొప్పున ఆఫర్ చేశారు. షేర్ చేసుకుంటే చెరో 25 లక్షలు.. శ్రీముఖి 25 లక్షలు.. రాహుల్ సిప్లిగంజ్ 25 లక్షలు సంపాదించుకునే అవకాశం కళ్ల ముందే ఉంది. అంగీకరించారా లేదా? అన్నది సస్పెన్స్.. అసలేం జరగబోతోంది? ఇద్దరికి 50లక్షలు ఆఫర్ చేశారు కాబట్టి విన్నర్ కోటి గెలుచుకోబోతున్నారా? అన్నది చూడాలి. ఒక రకంగా బాబా భాస్కర్ 25 లక్షలు వదులుకున్నాడు. మరి మిగతా వాళ్లలో వదులుకునేది ఎవరు?




Please Read Disclaimer