ఆలీ చేసిన పనితో బాబా భాస్కర్ కన్నీళ్లు!

0

బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ వాద ప్రతివాదనలు మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఒక్కో అభ్యర్ధి ఇద్దరిని నామినేట్ చేస్తూ.. ఎందుకు నామినేట్ చేస్తున్నామో కారణాలు చెప్పే సమయంలో హౌస్ మేట్స్ కొందరు చిన్నపాటి గొడవ కూడా పడ్డారు. ఇలా గొడవలు పడుతూనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. అలా ఫైనల్ గా రాహుల్ – హిమజ – అషు – మహేశ్ – శివజ్యోతి – పునర్నవి – బాబా భాస్కర్ ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

అయితే శివజ్యోతి కిందట వారమే నామినేట్ కాగా – మిగతా వారు ఇప్పుడు నామినేట్ అయ్యారు. వీరిలో రాహుల్ – హిమజ – అషు – పునర్నవి – మహేశ్ లని ఇంటి సభ్యులు నామినేట్ చేయగా – బాబా భాస్కర్ ని కెప్టెన్ అలీ నేరుగా నామినేట్ చేశాడు. అసలు నామినేషన్ ప్రక్రియకు ముందు కెప్టెన్ అలీ నలుగురు సభ్యులని ఎంచుకుని అందులో ఒకరిని ఫైనల్ గా ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ చేయొచ్చని చెప్పారు. దీంతో హిమజ – వితిక – రాహుల్ – బాబా భాస్కర్ లని అలీ ఎంచుకున్నాడు.

దీంతో ఆ నలుగురు సభ్యులు అలీని కాకా పట్టే పని చేశారు. ఇక బాబా భాస్కర్ అయితే ఫుల్ కామెడీ చేస్తూ అలీ చుట్టూనే తిరిగారు. ఈ తరుణంలో అలీ.. భాస్కర్ కి పర్సనల్ గా పిలిచి అన్నీ సమయాల్లో సరదాగా ఉండొద్దు – సీరియస్ గా ఉండమని సూచించాడు. దీంతో బాబా ఎలిమినేషన్ ప్రక్రియ సాగేప్పుడు సీరియస్ గానే ఉన్నారు. కానీ చివరికి అలీ – బాబా భాస్కర్ ని నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ కి చెప్పాడు. దీంతో బాబా కూడా ఈ వారం ఎలిమినేషన్ లోకి వచ్చారు.

అయితే అలీ అలా నామినేట్ చేయడంతో బాబా కన్నీరు పెట్టుకున్నారు. శ్రీముఖి ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ తాను ఎప్పుడూ ఇలాగే ఉంటానని.. బిగ్ బాస్ కోసం నటించాల్సిన అవసరం తనకు లేదని బాబా అన్నాడు. అలీ తనను నామినేట్ చేసిన పర్లేదు కాని.. అతను చెప్పిన కారణానికి చాలా బాధగా ఉందంటూ శ్రీముఖి దగ్గర ఏడ్చేశారు. అయితే శ్రీముఖి.. మీరు మీలా ఉండండి మహేష్ మాటలు వినొద్దు అంటూ సలహా ఇవ్వడంతో.. ‘నేను జాఫర్ ఉన్నప్పుడు అతనితో ఉన్నా.. ఇప్పుడు మహేష్ తో ఫ్రెండ్లీగా ఉంటున్నా’ అని భావోద్వేగానికి గురయ్యారు.
Please Read Disclaimer