ఈగకు సంతాప సభ పెట్టిన బాబా భాస్కర్…

0

మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 34 ఎపిసోడ్లని పూర్తి చేసుకుని శనివారం 35 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి..శుక్రవారం హౌస్ లో జరిగిన కొన్ని సీన్స్ మన టీవీ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. శుక్రవారం ఎపిసోడ్ లో రాహుల్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయిపోయాక – హౌస్ మేట్స్ కొందరు వాటర్ తో ఆడుకున్న విషయం తెల్సిందే.

శివజ్యోతి – మహేశ్ – అషు – బాబా భాస్కర్ – పునర్నవి – శ్రీముఖి – రాహుల్ తమకు నచ్చినట్లు వాటర్ తో ఆడేసి వేస్ట్ చేశారు. దాని ఫలితంగా బిగ్ బాస్ వాటర్ బంద్ చేశాడు. దాంతో వారంతా బిగ్ బాస్ కు క్షమాపణ చెబుతూ గుంజీలు తీశారు. దీంతో చివరికి బిగ్ బాస్ వాటర్ వదిలాడు. ఇక దీని తర్వాత హౌస్ లో అదిరిపోయే కామెడీ జరిగింది. శ్రీముఖి హిట్ స్ప్రే చేసి ఒక ఈగని చంపేసింది. దీంతో అక్కడకి వచ్చిన బాబా భాస్కర్ అయ్యో ఈగని చంపేశావుగా – అది ప్రెగ్నెంట్ తో ఉంది.. పాపం నీకు ఊరికే పోదు అంటూ సరదాగా ఆటపట్టించారు.

దీంతో శ్రీముఖి ప్రేయర్ చేస్తా అంటూ ‘ఈగ ఓ మంచి ఈగ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఇంకా కామెడీ చేసింది. వీరికి మిగతా హౌస్ మేట్స్ తొడయ్యి ‘ఈగ మరణానికి సంతాపం’ అంటూ గోల చేస్తూ వీర లెవల్లో పర్ఫార్మన్స్ చేశారు. ఈ ఎపిసోడ్ ముగిశాక పునర్నవి-వితికల మధ్య సీరియస్ చర్చ జరిగింది. శుక్రవారం ఎపిసోడ్ లో వితిక తన గురించి మాట్లాడినా వీడియోని బిగ్ బాస్ ప్లే చేసి పునర్నవికి చూపించిన విషయం తెలిసిందే. దానిపై ఫీల్ అవుతున్న పునర్నవి-వితికతో సరిగ్గా మాట్లాడటం లేదు.

దీంతో వితిక పునర్నవి దగ్గరకు వెళ్ళి గొడవని తగ్గించకుండా ఇంకా పెద్దది చేసింది. మళ్ళీ ఇద్దరు మధ్య గ్యాప్ పెరిగింది. ఇక మళ్ళీ రెండోసారి వెళ్ళిన వితిక అలిగి ఉన్న పున్నూని బుజ్జగించింది. పునర్నవిని ఎత్తుకుని బెడ్ మీదికి తీసుకువచ్చి గొడవకు పుల్ స్టాప్ పెట్టింది.
Please Read Disclaimer