ఆ ఏనుగు పిల్ల మహా కొంటెది

0

జంతువులను వేధించకపోయినా వాటితో సినిమాలు తీయడం నిషేధం. అందుకే ఇటీవలి కాలంలో ఎస్వీకే `రాజేంద్రుడు- గజేంద్రుడు` లాంటి సినిమాలు రావడం లేదన్న విమర్శ ఉంది. జంతువులపై పెటా బ్లూక్రాస్ అవిభాజ్య ప్రేమ పుణ్యమా అని ఆ తరహా సినిమాలకు ఎండ్ కార్డ్ పడింది. మన దర్శకనిర్మాతల్లో అలాంటి కొత్త పంథా స్క్రిప్టుల్ని ప్రయత్నించాలన్న ఊహ ఉన్నా ప్రయత్నం మాత్రం చేయడం లేదు. గ్రాఫిక్స్ లోనే జంతువుల్ని క్రియేట్ చేసుకోవాల్సి రావడం.. అలా చేసినా అవి ఆర్టిఫిషియల్ గానే కనిపించడంతో ఎవరూ ఆ తరహా స్క్రిప్టుల్ని ఎంకరేజ్ చేయడం లేదు. యానిమేషన్ గ్రాఫిక్స్ నేపథ్యంలో మనవాళ్లు ప్రయత్నించినా అవి సక్సెస్ అవ్వడం లేదు కూడా.

`శ్రీరామరాజ్యం`లో జింక పిల్లల్ని అత్యంత సహజసిద్ధంగా క్రియేట్ చేయడంలో బాపు చూపించిన పనితనాన్ని ఇతర దర్శకులు చూపించిన సందర్భాలు కూడా తక్కువే. బడ్జెట్ పరిమితుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా అడవిలో గజరాజు (ఏనుగు)ల నేపథ్యంలో ప్రస్తుతం ఓ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి రానా హీరోగా ప్రభు సోల్మన్ తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం హాథీ మేరా సాథీ.. ఇంకొకటి `తుపాకి` ఫేం విద్యుత్ జమ్వాల్ హీరోగా చక్ రస్సెల్ తెరకెక్కించిన జంగ్లీ. ఈ రెండు సినిమాల్లో ఏనుగుల పాత్ర కీలకమైనది. హాథీ మేరా సాథీ రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈలోగానే ఈ నెలాఖరున అంటే మార్చి 29న జంగ్లీ హిందీతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

`జంగ్లీ` సినిమాలో కీలక భూమిక పోషించిన ఓ గున్న ఏనుగు విన్యాసాల్ని తాజాగా జంగ్లీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆ ఏనుగు పిల్ల విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. క్యూట్ ఏనుగు బోయ్ కొంటె వేషాలకు పడి పడి నవ్వుకుంటున్నారంతా. చిత్ర కథానాయకుడు విద్యుత్ జమ్వాల్ కథానాయిక పూజా సావంత్ ఆషా భట్ అతుల్ కులకర్ణి స్పాట్ లో ఈ గున్న ఏనుగుతో సరదాగా ఆడుకుంటున్న ఆ దృశ్యం నెటిజనుల్లో దూసుకెళుతోంది. యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ చేస్తున్న వీడియో ఇది. కేవలం కొన్ని నిమిషాల వీడియోలోనే ఇంత మ్యాజిక్ చేసిన ఆ ఏనుగు పిల్ల సినిమా ఆద్యంతం ఎంతగా కామెడీ పండించనుందో చూడాలి.
Please Read Disclaimer