మరో మూవీ ప్రకటించిన సూపర్ స్టార్

0

ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ టైం నడుస్తుంది. సంవత్సరంకు రెండుకు మించిన సినిమాలను ఈయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఇటీవలే ఈయన ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక సంపాదన కలిగిన హీరోగా టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఖాన్స్ త్రయంను పక్కకు నెట్టి మరీ అక్షయ్ కుమార్ నెం.1 స్థానంలో నిలిచాడు. వరుసగా 100 కోట్లు.. 200 కోట్ల వసూళ్లు చేసే సినిమాలను చేస్తున్న అక్షయ్ కుమార్ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘బచ్చన్ పాండే’ అనే టైటిల్ తో తాను నటించబోతున్న సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఆగస్టు 15వ తారీకున ‘మిషన్ మంగల్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న అక్షయ్ కుమార్ ఆ తర్వాత ‘హౌస్ ఫుల్ 4’ చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. గుడ్ న్యూస్ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగా బచ్చన్ పాండే చిత్రాన్ని ప్రకటించిన అక్షయ్ కుమార్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ లో అక్షయ్ చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. నల్ల లుంగీ కట్టుకుని అయ్యప్ప దీక్ష తీసుకున్న వ్యక్తిగా కనిపిస్తూ.. మెడలో బంగారు గొలుసులు.. సీరియస్ గా కనిపిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది క్రిస్టమస్ కు విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడే ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించబోతున్నాడు. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో గతంలో కంటే చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా అభిమానులు అనుకుంటున్నారు.




Please Read Disclaimer