మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫస్ట్ లుక్

0

అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటిస్తోంది. జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో అఖిల్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఓ ఫారెన్ లొకేషన్ లో షూ లేకుండా నడుస్తూ ఉన్నాడు. గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. మెడలో స్కార్ఫ్.. తలపై క్యాప్ పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అలాంటి లొకేషన్ లో సింగిల్ గా ఎందుకు నడుస్తున్నాడు.. షూ ఎందుకు వేసుకోలేదు అనేది సస్పెన్స్ గా ఉంది. అఖిల్ గత సినిమాల పోస్టర్లు రిలీజ్ అయినప్పుడు అఖిల్ గాలిలో ఎగురుతూ.. గురుత్వాకర్షణ శక్తిని సవాలు చేసే స్టంట్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ గా నేలపై నడుస్తూ ఉండడం విశేషం.

మరి ఈ సినిమాతో అఖిల్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం దక్కేనా అన్నది ఆసక్తికరం. అఖిల్ కే కాదు. దర్శకుడు భాస్కర్ కూడా చాలాకాలం నుంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ గోల్డెన్ టచ్ తో ఈ బ్యాచ్ లర్ బాక్స్ ఆఫీస్ టెస్టును పాసవుతాడేమో వేచి చూడాలి.