బాల కొమురం భీమ్ రామరాజులు

0

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పునః ప్రారంభం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలుగా షూటింగ్ జరగడం లేదు. అక్టోబర్ లేదా నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు బాల నటీనటుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా కొమురం భీం అల్లూరి సీతారామరాజు పాత్రలతో సాగుతుందనే విషయం తెల్సిందే. ఆ పాత్రలను చిన్నతనం నుండే దర్శకుడు రాజమౌళి చూపించబోతున్నారు. అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీం పాత్రలకు చిన్న పిల్లలను నటింపజేశారు. ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో పాటు ఆలియా భట్ ల చిన్నప్పటి పాత్రల్లో నటించిన పిల్లల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి.. ఎన్టీఆర్.. శ్రియ.. అజయ్ దేవగన్ లతో వారు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అవ్వడంతో తెగ షేర్ చేస్తున్నారు.

ఇప్పటికే పిల్లలపై షూటింగ్ పూర్తి అయినట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతోంది. సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా చాలా ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఈ సినిమాలో పిల్లలుగా నటిస్తున్న వీరి గురించి ప్రముఖంగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఎన్టీఆర్.. చరణ్ ఇంకా ఆలియా పాత్రల చిన్నప్పటి పాత్రలకు చక్కగా సూట్ అయ్యే వారిని ఎంపిక చేశారు. ఎన్టీఆర్ చిన్నతనంలో అలాగే ఉండేవాడా అన్నట్లుగా ఆ చిన్న కొమురం భీం ఉన్నాడు. ఆలియా చిన్నతనంలో ఇలాగే ఉండేది అన్నట్లుగా చిన్న సీత ఉంది.