బాలయ్య వస్తున్నట్టా రానట్టా?

0

ఎన్టీఆర్ డిజాస్టర్ ఫలితం వియ్యంకుడి పార్టీ ఓటమి వెరసి మొత్తం ఆరు నెలల గ్యాప్ తీసుకుని ఖాళీగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తనకు జైసింహ లాంటి కమర్షియల్ సేలబుల్ మూవీ ఇచ్చిన నమ్మకంతో దర్శకుడు కెఎస్ రవికుమార్ కే మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానే లేదు. హీరొయిన్ల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. అయితే అసలు కారణాలు ఇవి కాదట.

కథకుడు పరుచూరి మురళితో కలిసి రవికుమార్ స్క్రిప్ట్ ని ఓ కొలిక్కి తెచ్చేందుకు టైం తీసుకుంటున్నారట. ఈలోగా బాలయ్య సినిమాకు తగ్గట్టు గెడ్డం పెంచి దానికి అనుగుణంగా మీసకట్టు కూడా మార్చుకున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ గా మారిన పోలీస్ ఆఫీసర్ కథగా దీని గురించి టాక్ ఉంది. మొన్నటిదాకా ఇది సంక్రాంతికి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. కాని కేవలం ఐదు నెలల కాలంలో దీన్ని పూర్తి చేయడం అసాధ్యం కాకపోయినా ఒత్తిడి మీద షూటింగ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎన్టీఆర్ బయోపిక్ తో సహా పలుమార్లు బాలయ్యకు అనుభవమయ్యింది.

అందుకే ఇప్పుడీ మూవీ విషయంలో రిలీజ్ డేట్ అంటూ డెడ్ లైన్ పెట్టుకోకుండా చేద్దామని కుదిరితే సంక్రాంతి లేదా వేసవి అయినా పర్వాలేదు అనే తరహాలో సూచన చేశారట. సో ఇది సంక్రాంతి బరిలో ఉండొచ్చు లేదు అనే గ్యారెంటీ అయితే ప్రస్తుతానికి లేదు. దీనికి రూలర్ – క్రాంతి అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అన్ని సెట్ చేసుకుని ఓకే అనుకున్నాక ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సంక్రాంతికి మహేష్ బాబు-అల్లు అర్జున్ ఇద్దరూ ఆ టైంని లాక్ చేసుకున్నారు. డేట్స్ ఒకటే తెలియాల్సి ఉంది
Please Read Disclaimer