మోక్షజ్ఞతో కలిసి బాలయ్య పూజలు.. ఎందుకంత వైరల్?

0

గుడికి వెళ్లటం తప్పేం కాదు. అందులోకి ఫ్యామిలీతో కలిసి గుడికి వస్తున్నారన్న విషయం అందరికి తెలియకూడని రహస్యమేమీ కాదు. కానీ.. అందుకు భిన్నంగా ప్రముఖ నటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గుడికి రావటం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సంచలనమైంది.

ఎందుకంటే.. బాలయ్య వెంట ఆయన కుమారుడు ఉన్నాడు. మోక్షజ్ఞ ఫిలిం డెబ్యూ గురించి చాలా రోజుల నుండి చర్చ సాగుతోందనే విషయం తెలిసిందే. కానీ మొదట్లో నార్మల్ గానే ఉన్న మోక్షజ్ఞ గత కొంతకాలంగా బొద్దుగా కనిపిస్తున్నాడు. ఈమధ్య ఒకటి రెండు సార్లు మోక్షు ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నాడని త్వరలోనే ఫిట్ గా మారతాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ ఫోటో చూస్తే మాత్రం అలాంటిదేమీ లేదని అర్థం అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ చాలా రోజుల నుండి మోక్షు ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ మాత్రం గతంలో వైరల్ అయిన ఫోటోలలో కనిపించిన విధంగానే బొద్దుగా ఉండడం వారిని నిరాశపరుస్తోంది. త్వరలో బాలయ్య కుమారుడు లుక్ లో మేకోవర్ ఉంటుందని.. సినీ రంగ పరిచయం కూడా ఉంటుందని ఎదురుచూస్తున్నవారు ఈ ఫోటోలు చూసిన తర్వాత అసలు మోక్షజ్ఞ కే సినీ రంగం పై ఆసక్తి ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ కొడుకును తీసుకొని బాలయ్య వచ్చిన గుడి ఎక్కడ? దాని ప్రత్యేకత ఏమిటన్నది చూస్తే.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చౌడేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో చండీ హోమం.. సుదర్శన హోమంతో పాటు.. స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఆలయంలో బాలకృష్ణ పూజలు చేయించటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు నిర్వహించారు. కాకుంటే.. ఈసారి కొడుకుతో రావటం.. ఆ విషయాన్ని రహస్యంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. మోక్షజ్ఞ లుక్ వైరల్ గా మారటమే కాదు.. ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer