బాలకృష్ణ – మోక్షజ్ఞతో మల్టీస్టారర్ చేయబోతున్న అనిల్ రావిపూడి??

0

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన అనిల్ రావిపూడికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కమర్షియల్ సినిమా అంటే ఏంటో తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. రాజమౌళి కొరటాల శివ తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. కెరీర్లో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ స్థానానికి చేరుకున్నాడు. ‘పటాస్’తో మొదలైన ఆయన సినీ ప్రయాణం ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్ 2’ సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఇంకసూపర్ స్టార్ మహేష్ బాబుతో తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను తెరకెక్కించి మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిపాడు.

అయితే తాజాగా తరుణ్ భాస్కర్ హోస్ట్ గా చేస్తున్న ‘నీకు మాత్రమే చెప్తా’ అనే షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో భాగంగా హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను ఎప్పటికైనా డైరెక్ట్ చేస్తానని అనిల్ రావిపూడి వెల్లడించాడు. కుదిరితే బాలకృష్ణతో కూడా సినిమా చేసేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో బాలకృష్ణ మోక్షజ్ఞతో కలిసి ఉన్న ఫోటో నా గదిలో ఉండేదని ఒకవేళ నేను డైరెక్టర్ అయితే వీరిద్దరి తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తానని అప్పట్లో అనే వాడినని అనిల్ రావిపూడి వెల్లడించాడు. బాలయ్య అనిల్ రావిపూడి కలయికలో సినిమా వస్తే బాలయ్య అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి ఎఫ్-2 కి సీక్వెల్ ఎఫ్-3 సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో హీరోలుగా ఎఫ్ 2లో నటించిన వెంకటేశ్ వరుణ్ తేజ్ లే నటించనున్నారు. వీరికి తోడుగా మరో హీరో జత కానున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-