Ntr: బ్లాక్ బస్టర్ రీమేక్‌లో ఎన్టీఆర్, బాలయ్య.. ఇద్దరికీ ‘ఈగో’!!

0

నందమూరి నటసింహం బాలయ్యకు కోపం రాకుండా ఉండాలే కాని.. వచ్చిందంటే వాడు లేడు వీడు లేడూ ఎవడైనా సరే దబిడిదిబిడే. అభిమాని అయినా సరే హద్దు దాటితే బాలయ్య చెడుగుడు ఆడేస్తారు. అదే సందర్భంలో బాలయ్యను మంచి మనసున్నోడు.. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంటూ పొగిడేవాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే బాలయ్యకు కాస్త ఈగో ఎక్కువే అనే వాళ్లు లేకపోలేదు. అయితే రియల్ లైఫ్‌లో బాలయ్యకు ఈగో ఉందో లేదో తెలియదు కాని.. రీల్ లైఫ్‌లో ఈగో ఉన్న పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ అనే మలయాళ రీమేక్ చిత్రంలో బాలయ్య నటించబోతున్నారట. బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్‌‌లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబోతున్నారు ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు కన్ఫార్మ్ కాలేకపోయినప్పటికీ హీరో పాత్రకు బాలయ్యను అనుకుంటున్నారట.

ఇద్దరు బలమైన వ్యక్తులు మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఈ చిత్ర కథ ఉంటుంది. తమిళ్‌లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా.. హీరో బ్రదర్స్ సూర్య, కార్తీలు నటిస్తున్నట్టు వార్తలు రాగా.. శరత్ కుమార్ శిశికుమార్‌లు ఫైనల్ అయినట్టు సమాచారం. ఇక తెలుగులో బాలయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది. మరి ఈయనతో ఈగో వల్ల తలపడే మరో హీరో మరెవరో కాదని జూ. ఎన్టీఆర్ అంటూ ప్రచారం మొదలైంది. గతంలో జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర బాలయ్య చేయాల్సి ఉండగా.. ఎందుకో మిస్ అయ్యింది. ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ చిత్రంలో బాలయ్యతో ఎన్టీఆర్ తలపడితే ఆ మజానే వేరు అనుకుంటున్నారు నందమూరి అభిమానులు. చూడాలి మరి ఎన్టీఆర్ ఈగో విషయంలో బాలయ్యతో ఢీ కొట్టేందుకు రెడీ అంటారో.. అసలు ఈ ఈగో పాత్రకు బాలయ్య ఓకే అంటారో లేదో త్వరలో తేలనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-