బాలయ్య ‘ఫ్యాన్స్’కి భారీ గిఫ్ట్.. కొత్త టీజర్ విడుదల!

0

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు నందమూరి బాలకృష్ణ. కెరీర్ స్లోగా నడుస్తున్నప్పుడు 2010లో డైరెక్టర్ బోయపాటి శ్రీను అప్పటి వరకు చూడని మేనరిజంలో బాలయ్యను ఆవిష్కరించి సక్సెస్ అయ్యాడు. ‘చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవ్” అంటూ బాలయ్య చెప్పిన డైలాగుకు థియేటర్లలో మార్మోగిపోయాయి. ఆ ఒక్క హిట్టు బాలయ్య క్రేజ్‌ను మళ్లీ నిలబెట్టేసింది. కానీ మళ్లీ ప్లాపులు. ఈ దెబ్బతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఆ టైంలో మళ్లీ బోయపాటి రంగంలోకి దిగి ‘లెజెండ్’ తీసాడు. 2014లో లెజెండ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈసారి బాలయ్యను రెండు లుక్స్ లో గర్జించినట్లు ఆవిష్కరించాడు. వీరిద్దరూ కలిసి ముచ్చటగా మూడోసారి జతకట్టి బిబి3 సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే బాలయ్య పుట్టినరోజున బిబి3 సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అసలు ఈ టీజర్లో బాలకృష్ణ లుక్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. తెల్లని పంచెకట్టులో బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మొన్నటి ‘రూలర్’ లుక్‌కి.. ఇప్పుడు బోయపాటి సినిమాలో లుక్‌కి అసలు పోలిక లేదు. అంత బాగా మార్చేశాడు బోయపాటి. ఆ పంచెకట్టులో ఫైట్ సీన్ అయితే గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే తాజాగా బాలయ్య అభిమానుల కోసం బిబి3 రోర్ కి సంబంధించిన యానిమేటెడ్ టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ఆ టీజర్లో కూడా బాలయ్య “శ్రీను గారు నాన్న గారు బాగున్నారా..” అనే డైలాగ్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇది బాలయ్య అభిమానులకు రెండో గిఫ్ట్ అని భావిస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కానీ బాలయ్య సరసన హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Please Read Disclaimer