ఆ పాత్రకు బాలయ్య సూట్ అవుతారా?

0

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమానుండి రిలీజ్ అయిన పోస్టర్లు ఇప్పటికే ఆసక్తిని కలిగించాయి. మొదట్లో రిలీజ్ అయిన పోస్టర్లలో బాలయ్య ఐరన్ మ్యాన్ సినిమాలో టోనీ స్టార్క్ పాత్ర స్టైల్ గడ్డంతో కనిపించడం అందరినీ ఆకర్షించింది. అయితే ఈమధ్య దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించారు.

దీన్ని బట్టి బాలయ్య రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉండే పాత్రలు పోషిస్తున్నారని అందరికీ అర్థం అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ లో నటిస్తున్నారని.. ఒక పాత్రలో ఐటీ ఉద్యోగిగా కనిపిస్తారని అంటున్నారు. స్టైలిష్ గా సూటు బూటులో ఐరన్ మ్యాన్ గడ్డంలో ఉన్న బాలయ్య సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అని సమాచారం. పోలీసు పాత్రలు.. ఫ్యాక్షనిస్టు పాత్రలు.. రాజుల పాత్రలు ఇలా ఎలాంటి పాత్రలైనా తీసుకోండి.. బాలయ్య వాటిలో పరకాయ ప్రవేశం చేస్తారు. నిజానికి సినిమా పూర్తయ్యేంతవరకూ ఆయన ఆ పాత్రలోనే ఉంటారు. బాలయ్య నటనకు ఎలాంటి వంక పెట్టలేం.. ఆయన ఓ మంచి నటుడు. అవన్నీ ఓకే కానీ ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర బాలయ్యకు అసలు సూట్ అవుతుందా అనే చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది.

ఇప్పటివరకూ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అంటే 25-35 వయసులో ఉన్న హీరోలనే చూపించేవారు. సాఫ్ట్ వేర్ రంగంలో యాభైలు.. అరవైల వయసు వ్యక్తులు ఉన్నా సినిమాల్లో అలాంటివారిని చూపించడం అరుదు. మరి అరవైకి దగ్గరలో ఉన్న బాలయ్య ఈ పాత్రకు సూట్ కాడేమోనని కొందరు అంటున్నారు. మరో సీనియర్ స్టార్ వెంకటేష్ కూడా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా గతంలో నటించారు అది చాలా ఏళ్ళ క్రితం. మరి బాలయ్య ఈ వయసులో ఐటీ ఉద్యోగిగా ఎలా ఉంటారో.. ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.Please Read Disclaimer