#BB3 టైటిల్ అప్ డేట్

0

బాలకృష్ణ బోయపాటిల కాంబోలో రాబోతున్న మూడవ సినిమా(బిబి3) పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. సింహా లెజెండ్ చిత్రాల స్థాయిలో ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రం కోసం బోయపాటి చాలా పవర్ ఫుల్ టైటిల్స్ ను పరిశీలించాడు. బాలయ్య బర్త్ డే సందర్బంగా విడుదలైన వీడియోతోనే టైటిల్ ను ప్రకటించాలని అనుకున్నారు. అప్పటికే మోనార్క్ అనే టైటిల్ ప్రచారం జరిగింది. కాని అంతకు మించిన టైటిల్ ను పెట్టాలనుకున్నారట. కాని చివరకు మోనార్క్ నే ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఒక మంచి సందర్బం చూసి బిబి3 టైటిల్ ‘మోనార్క్’ అంటూ అధికారికంగా ప్రకటించేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నాడు. సింహా లెజెండ్ టైటిల్స్ తరహాలోనే మోనార్క్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉందనే టాక్ వచ్చింది. అందుకే బోయపాటి మోనార్క్ టైటిల్ కే ఫిక్స్ అయ్యాడని బాలకృష్ణ కూడా ఆ టైటిల్ పట్ల సంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది.

బాలకృష్ణ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో బోయపాటితో సినిమా చేస్తున్న కారణంగా నందమూరి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అంతా సవ్యంగా ఉండి ఉంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేది. కాని షూటింగ్ కు మహమ్మారి వైరస్ ఆటంకిగా మారింది. ఈ చిత్రం సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.




Please Read Disclaimer