అజిత్ పాటకు బాలయ్య డాన్స్

0

కొన్ని పాటలకు భాష అవసరం లేదు. పాట నచ్చితే ఏ భాష అనేది పట్టించుకోకుండా కాలు కదిపెస్తారు కుర్రకారు. అలాంటి సాంగ్స్ లో ‘ఆలుమా డోలుమా’ ఒకటి. తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాలం’ సినిమాలోని ఈ పాట పబ్ లో ఈవెంట్స్ లో ఎక్కువగా ప్లే చేస్తుంటారు. అనిరుద్ ట్యూన్ చేసిన ఈ పాటకు కుర్రకారు ఓ తెగ ఊగిపోతుంటారు.

అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఈ పాటకు తనదైన ఎనర్జీ స్టెప్స్ వేసి అందరినీ ఎట్రాక్ట్ చేసాడు. ‘రూలర్’ సాంగ్ షూటింగ్ గ్యాప్ లో పబ్ లో బాలయ్య అజిత్ సాంగ్ కి ఎంతో ఎనర్జీగా డాన్సులేసాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులతో పాటు మిగతా వారు కూడా అరవై చేరువలో ఇరవై ఏళ్ల కుర్రాడిలా బాలయ్య డాన్సులు ఇరగదీస్తున్నాడే అంటూ ఆశ్చర్య పోతున్నారు.
Please Read Disclaimer