లాక్ డౌన్ లో మోక్షజ్ఞపై బాలయ్య దృష్టి!

0

నందమూరి ఫ్యాన్స్ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బాలయ్య షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. ఆయన ప్రస్తుత సమయంలో మోక్షజ్ఞ విషయంలో దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో కథలు విన్న బాలయ్య కొన్నింటిని మోక్షజ్ఞ కోసం ఓకే చేశాడట. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసి వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు.

మోక్షజ్ఞ కూడా ఈ సమయంలో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది వరకు నార్మల్ వెయిట్ కు అతడు వస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్ కు వెళ్లడం కష్టం. కనుక పలువురు దర్శకులు కూడా మోక్షజ్ఞ కోసం కథలు రాస్తున్నారట. బాలయ్య వాటిని కూడా వినేందుకు సిద్దంగా ఉన్నాడు. వచ్చే ఏడాది వరకు ఏదో ఒకటి ఫైనల్ చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లుగా నందమూరి వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. వచ్చే ఏడాది సమ్మర్ లేదా మళ్లీ దసరా వరకు సినిమా విడుదల కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు బాలయ్య బోయపాటి మూవీ కాంబో హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది చివరి వరకు పరిస్థితులు కుదుట పడితే అప్పుడు షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.