ఫ్రెంచ్ లుక్ తో బాలయ్య అదుర్స్

0

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఆరు నెలలకు పైగా రెస్ట్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు తన 105 సినిమాకు రంగంలోకి దిగేశాడు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి కానీ ఇంకో రెండు నెలలు ఆగితే కానీ క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం ఈ సినిమా తాలూకు డిఫరెంట్ లుక్ లో బాలయ్య పిక్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

ఫ్రెంచ్ కట్ తరహాలో గెడ్డం రెండు వైపులా షేవ్ చేసి చుబుకం కింద చక్కగా ట్రిమ్ చేసిన స్టైల్ తో బాలయ్య ఇంకాస్త యంగ్ లుక్ లోకి మారిపోవడం గమనార్హం. ఇప్పటికే ఈ పిక్ ని తెగ షేర్ చేస్తున్న బాలయ్య ఫ్యాన్స్ మరో మంచి ఎంటర్ టైనర్ తమ హీరో నుంచి వస్తోందని సంబరపడుతున్నారు. జైసింహతో తనకో డీసెంట్ కమర్షియల్ హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో మరోసారి ఆయనకే ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్ ఉంది కాని తర్వాత స్క్రిప్ట్ మారిందన్న న్యూస్ గురించి యూనిట్ తరఫున ఎలాంటి సమాచారం లేదు.

సోనాల్ చౌహాన్ – వేదిక హీరొయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు మెయిన్ విలన్ గా చేస్తున్నట్టు వినికిడి. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ఇప్పుడీ గెటప్ తో చాలా కీలకమైన సన్నివేశాలు ఉంటాయట. ఫస్ట్ హాఫ్ లో ఈ లుక్ లో కనిపించి సెకండ్ హాఫ్ లో ఎవరూ ఊహించని గెటప్ తో మంచి మాస్ మసాలా ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. శాతకర్ణి-జైసింహ ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు క్రాంతి టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home