బాలయ్య ఈ సైలెన్స్ ఏలయ్యా ?

0

నందమూరి బాలకృష్ణ సినిమా సెట్ లో అడుగు పెట్టి ఏడు నెలలు దాటేసింది. వంద సినిమాల కెరీర్ లో బాలయ్య ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అందులోనూ గత ఐదారేళ్లుగా నందమూరి హీరో చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ తీవ్రంగా నిరాశ పరచడంతో డిఫెన్స్ లో పడ్డ బాలకృష్ణ ఊహించని రీతిలో కెఎస్ రవికుమార్ ని దర్శకుడిగా సెట్ చేసుకుని కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. కానీ ఇదింకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనే లేదు.

ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే 2020 సంక్రాంతి బరిలో దీన్ని నిలబెట్టాలనుకున్నారు. కానీ ఎన్నికలు అయ్యాక స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చాల్సి రావడం వల్లే వాయిదా తప్పలేదని ఇంతకు ముందే టాక్ వచ్చింది. ఇప్పటికీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. హీరోయిన్ల సెలక్షన్ పెద్ద ఇబ్బందిగా మారిందని ఇన్ సైడ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సోనాలి చౌహన్ ను తమిళ్ లో కాంచన లాంటి బి గ్రేడ్ సినిమాలు చేసుకుంటున్న వేదికను ఎంచుకుంటున్నట్టు న్యూస్ వచ్చాయి కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

భూమిక కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తోందని వినికిడి. ఎప్పుడు ఫైనల్ చేసి మొదలు పెడతారో వేచి చూడాలి. అసలే తమిళ్ లో పూర్తిగా ఫాం కోల్పోయిన రవికుమార్ ని జైసింహ లాంటి యావరేజ్ సినిమా ఇచ్చాడన్న కారణంగా బాలయ్య ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అభిమానులను సైతం టెన్షన్ పెడుతోంది. మొదలయ్యే దాకా ఇవన్ని సందేహాలుగానే మిగలనున్నాయి. వీటికి చెక్ పెట్టాల్సింది బాలయ్యనే.
Please Read Disclaimer