బాలయ్యను పట్టించుకోక పోవడం ఏంట్రా బ్లెడీ ఫూల్స్

0

నందమూరి బాలకృష్ణ సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతున్న కారణంగా నిర్మాతలు ఆయన్ను పట్టించుకోవడం లేదని.. ఆయనతో సినిమాలు అంటేనే ఆసక్తి చూపడం లేదు అంటూ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే బాలకృష్ణ సినిమాల సంఖ్య తగ్గించి ఉంటాడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయమై బాలయ్య అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. బాలకృష్ణ ఊ అంటే సినిమాలు నిర్మించేందుకు పదుల సంఖ్యలో నిర్మాతలు ఆయన డేట్ల కోసం ఎదురు చూసే వారు ఉన్నారు అంటున్నారు.

బాలకృష్ణ పదుల కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసే రకం కాదు. తన సినిమా మార్కెట్ ను బట్టి పారితోషికం వసూళ్లు చేస్తాడు. మీడియం బడ్జెట్ తో సినిమాను నిర్మించినా కూడా పట్టించుకోడు. సినిమా నిర్మాణం వ్యవహారంలో ఆయన అస్సలు పట్టించుకోడు. అలాంటి హీరోలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నారు చెప్పండి. అందుకే అందరు నిర్మాతలు కూడా బాలయ్యను తమ బ్యానర్ లో నటింపజేయాలని ఇంకా కూడా కోరుకుంటూనే ఉంటారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు.

నిర్మాతలు బాలయ్యను పట్టించుకోక పోవడం ఏంట్రా బ్లెడీ ఫూల్స్.. ఇప్పటికి కూడా ఎంతో మంది నిర్మాతలు ఆయన డేట్ల కోసం కాచుకు కూర్చుని ఉన్నారు. ఆయనతో వరుసగా సినిమాలు నిర్మించేందుకు కూడా కొందరు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. తదుపరి చిత్రం విషయంలో బాలయ్య ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు.
Please Read Disclaimer