రామారావు గారిని అనీల్ రావిపూడి వదిలేసినట్లేనా?

0

ఎఫ్ 2.. సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి వచ్చి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి. ఈయన ఎఫ్ 2 కు ముందు బాలకృష్ణ తో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కథ కూడా చెప్పాడు. దానికి రామారావు గారు అనే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కూడా ఆసక్తి చూపించాడట. కాని ఏం జరిగిందో ఏమో కాని రామారావు గారు చిత్రాన్ని పక్కకు పెట్టారు.

టాలీవుడ్ లెజెండ్ అయిన రామారావు పేరు మీద సినిమా తీస్తే సినిమాలో మ్యాటర్ ఏది అయినా ప్రేక్షకుల అటెన్షన్ ను మాత్రం విపరీతంగా దక్కించుకునేది. తండ్రి పేరు తో సినిమా ను చేసిన క్రెడిట్ కూడా బాలకృష్ణ కు దక్కేది. బాలయ్య కాకున్నా ఎన్టీఆర్ చేసినా కూడా తాత పేరుతో సినిమా చేసినందుకు నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు. కాని ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడికి ఆ ఆలోచన కూడా ఉన్నట్లుగా అనిపించడం లేదు. వరుసగా వేరు వేరు సినిమాలతో అనీల్ బిజీ అయ్యాడు.

ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న అనీల్ ఆ వెంటనే అఖిల్ అక్కినేని తో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అనీల్ రామారావు గారు టైటిల్ తో సినిమా చేస్తాడా అనేది అనుమానం గానే ఉంది. ఇదే సమయంలో నాగచైతన్య తో దర్శకుడు పరుశురామ్ నాగేశ్వరరావు అనే సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

తాత పేరు మీద సినిమా చేయబోతున్నందున చైతూ చాలా ఎగ్జైట్ గా ఉండటంతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాగేశ్వరరావు తర్వాత నందమూరి హీరోలు ఎవరైనా రామారావు గారు సినిమా చేసినా కూడా అక్కినేని వారి మూవీకి కాపీ అంటారేమో. కనుక రామారావు గారు సినిమాను దాదాపు గా వదిలేసినట్లే అంటూ టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer